Friday, November 27, 2015

Eka Sloka Bhagavatamu

ఏకశ్లోకి భాగవతము
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )





ఆదౌ దేవకి దేవీ గర్భజననం - గోపీగృహే వర్ధనం

మాయాపూతన జీవీతాపహరణం - గోవర్ధనోద్దారణం

కంసచ్చేదన కౌరవాదిహననం - కుంతీసుతాన్ పాలనం

యేతద్భాగవతం పురాణకధితం శ్రీకృష్టలీలమృతం . 



Thursday, November 26, 2015

Eka Sloka Ramayanamu

ఏకశ్లోకి రామాయణము
( నిత్యం పటించవలిసిన శ్లోకం )




ఆదౌరామ తపోవనాది గమనం - హత్వామృగంకాంచనం

వైదేహీహరణం - జటాయుమరణం - సుగ్రీవసంభాషణం

వాలీనిగ్రహణం - సముద్రతరణం -లంకాపురీదాహనం

పశ్చాద్రావణ కుంభకర్ణహాననం యేతద్దిరమాయణమ్.




Wednesday, November 25, 2015

మహానంది

మహానంది

రాష్ట్రం:                      ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:                       కర్నూలు
మండల కేంద్రము:  మహానంది



                                               మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము. నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.



                               ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.




                             ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.

ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కలదు. అదేమంటే, గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం కలదు. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదే విధంగా స్థంబాలపై, గాంధీ మహాత్ముని ప్రతిమ, ఇందిరా గాంధి ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ క్షేత్రం 19వ శతాబ్ది తొలిభాగంలో కీకారణ్యంగా ఉండేది. 1830లో ఈ ప్రాంతానికి కాశీయాత్రలో భాగంగా వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో భాగంగా ఆ వివరాలు వ్రాశారు. గుడి చుట్టూ సకలఫల వృక్షాలూ ఉండేవనీ, గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని ఆయన వ్రాతల వల్ల తెలియవస్తున్నది. అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. చివరకు నిప్పు దొరకడం కూడా ప్రయాసగానే ఉండేదని ఆయన వ్రాశారు. రాత్రిపూట మనుష్యులు ఉండరనీ తెలిపారు. అర్చకునిగా తమిళుడు ఉండేవారనీ, వచ్చినవారు తామే శివునికి అభిషేకము చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలి జాముకు వచ్చి ఆలయగర్భగుడి తెరిచేవారు. గోసాయిలు, బైరాగులు రెండు మూడు రోజులు ఆ స్థలంలోనే ఉండి పునశ్చరణ చేసేవారు. మొత్తానికి 1830ల నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైనా సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది. నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యము కలదు. గిద్దలూరు-నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె, ఇక్కడికి సమీప రైల్వే స్టేషను.

నవనందులు:   



                                  కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.



ఎలా వెళ్ళాలి?

                           సమీపంలో నంద్యాల రైల్వే స్టేషన్  ఉంది.మహానంది నంద్యాల నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం హైదరాబాద్, హైదరాబాద్ నుండి కర్నూలు కి 215 కిమీ ఉంటుంది.

Monday, November 23, 2015

Eka Sloka Bhagavatgita

ఏకశ్లోకి భగవద్గీత
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )



ఓం యత్రయోగీశ్వరః కృష్టోయత్రపార్థోధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ

పార్ధాయ ప్రతిబోధితాం - భగవతే నారాయణేన స్వయమ్ 

వ్యాసేన గ్రథితాం - పురాణమునినా మద్యేమహాభారతమ్ 

అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశధ్యాయినీ

మంబత్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్. 




Saturday, November 21, 2015

దశరథ ప్రోక్త శనిస్తోత్రము (dasaradha prokta shanistotram)

దశరథ ప్రోక్త శనిస్తోత్రము

దశరథుడే స్వయం గా రచించిన శని స్తోత్రం దీనిని ప్రతి నిత్యం చదవడం వాల్ల శని దోషాలు దూరమౌతాయి.




నమః కృష్టాయ నీలాయ l శిఖి ఖండ నిభాయచ l
నమో నీల మధూకాయ l నీలోత్పల నిభాయచ l

నమో నిర్మాంస దేహాయ l దీర్ఘ శ్రుతి జటాయచ l
నమో విశాల నేత్రాయ l శుష్కోదర భయానక l

నమః పౌరుష గాత్రాయ l స్థూల రోమాయతే నమః l
నమో నిత్యం క్షుధార్తాయ l నిత్య తృప్తాయతే నమః l

నమో దీర్ఘాయ శుష్కాయ l కాలదంష్ట్ర నమోస్తుతే l
నమస్తే ఘోర రూపాయ l దుర్నిరీక్ష్యాయతే నమః l

నమస్తే సర్వ భక్షాయ l వలీముఖ నమోస్తుతే l
సూర్య పుత్ర నమస్తేస్తు l భాస్కరోభయ దాయినే l

అధో దృష్టే నమస్తేస్తు l సంవర్తక నమోస్తుతే l
నమో మందగతే తుభ్యం l నిష్ర్పభాయ నమోనమః l

తపసా జ్ఞాన దేహాయ l నిత్యయోగ రతాయచ l
జ్ఞాన చక్షుర్నమస్తేస్తు l కశ్యపాత్మజ సూనవే l

తుష్టో దదాసి రాజ్యం తం l క్రకుద్ధో హారసి తత్ క్షణాత్ l
దేవాసుర మనుష్యాశ్చ l సిద్ధ విద్యాధరో రగాః l





Friday, November 20, 2015

నవ దుర్గ స్తుత్తిః (nava durga stutti)

నవ దుర్గ స్తుత్తిః
( ఈ స్తోత్రాన్ని ఎవరు భక్తీ తో పఠిస్తే వారికి దేవి అనుగ్రహం కలుగును ) 




ప్రథమా శైలపుత్రీచ; 
ద్వితీయ బ్రహ్మచారిణీ; 
తృతియా చంద్ర ఘంటేతి; 
కూష్మాండేతి చతుర్థికీ;
 పంచమా స్కంద మాతేతి; 
షష్ఠా కాత్యాయనేతిచ; 
సప్తమా కాళరాత్రీచ; 
అష్టమాచాతి భైరవీ; 
నవమా సర్వసిద్ధిశ్చాత్; నవదుర్గా ప్రకీర్తితా!

అష్టాదశ పీఠముల ప్రార్థన (Ashtadasa pitamulu)

అష్టాదశ పీఠముల ప్రార్థన

(ఈ  స్తోత్రాన్ని ప్రతి రోజు సూర్యష్టమయం లో పఠిస్తే శ్రత్రువుల మీద విజయం, సర్వ రోగాలు దురమౌతయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. )





ఓం లంకాయాం శాంకరీదేవి ;

కామాక్షీ కాంచికాపురీ ;

ప్రద్యుమ్నే శృంఖలాదేవీ ;

చాముండే క్రౌంచపట్టణే ;

అల్లంపురి జోగులాంబ ;

శ్రీశైలే భ్రమరాంబికా ;

కొల్హాపురీ మహలక్ష్మీ ;

మహుర్యే ఏకవీరికా ;

ఉజ్జయిన్యాం మహాకాళీ ;

పీఠికాయాం పురుహూతికా ;

ఓఢ్యాయం గిరిజాదేవి ;

మాణిక్యా దక్ష వాటికా ;

హరిక్షేత్రే కామరూపీ ;

ప్రయాగే మాధవేశ్వరీ ;

జ్వాలాయాం వైష్ణవీదేవీ ;

గయామాంగళ్య గౌరికా ;

వారణశ్యాం విశాలాక్షీ ;

కాశ్మీరేతు సరస్వతీ ;

అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం

సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రువినాశనం

సర్వ రోగహరం దివ్యం, సర్వసంపత్కరం శుభం !







గోమాహత్మ్యము ( Gomahatyamu)

గోమాహత్మ్యము



అలనాడు 

  1. దేవేంద్రుని భార్య శచీదేవి
  2. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి
  3. శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి
  4. శ్రీరాములవారి భార్య సీతాదేవి
  5. గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణిదేవి
  6. ఈశ్వరుని భార్య పార్వతీదేవి 
  7. వశిష్టులవారి భార్య అరుంధతీదేవి

వీరంతా గూడి ప్రాతః కాలమునలేచి ఆడవారు చేసిన పాపములు ఎలగును పోవును క్రుష్ణా? అని అడిగినారు.

ప్రొద్దుటేలేచి గోవుమాహత్మ్యము పఠించుకుంటే సకలపాపములు పోవును.
అంటుకలిపిన పాపము, ముట్టుకలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగీ ఎరిగకచేసిన పాపము అంతా కూడా పరిహరము.

మధ్యాహ్నకాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే

సహస్ర గుళ్ళలో దీపారధన చేసినట్లు, జాన్మంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చెసినట్లు.

అర్థరాత్రివేళపఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే 

యమభాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవుమాహాత్మ్యము పఠించిన పణతివస్తుంది.

 ఏలాగున వస్తుంది? ఏ తీరునవస్తుంది?

 కనకాంబరాలతో కదులుతో తులా భారలతో తులతూగుతూ తన భర్తను తలచుకోని తనపుత్ర పుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్రబంధువులనను కొని, లక్ష్మీ మహలక్ష్మీ ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు, పారాణి, అక్షతలు, గంధములు యిచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుపముక్కు కాకులను వెనక్కుత్రోసేసి, మండే మండే పెనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశి, గయ, ప్రయాగ అన్నీ చూసుకొని, వైకుంఠమునకు వెళ్ళినది, విన్నవారికి విష్ణులోకము , చెప్పిన వారికి పుణ్యలోకము. 




ఏకవింశతి దేవీస్తుతి శ్లోకీ (Devistuti)

ఏకవింశతి దేవీస్తుతి శ్లోకీ

  1. యాదేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  2. యాదేవీ సర్వభూతేషు చేతనే త్యభిధీయతే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  3. యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  4. యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  5. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  6. యాదేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  7. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  8. యాదేవీ సర్వభూతేషు తృష్టారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  9. యాదేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  10. యాదేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  11. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  12. యాదేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  13. యాదేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  14. యాదేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  15. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  16. యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  17. యాదేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  18. యాదేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  19. యాదేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  20. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  21. యాదేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

తా : సర్వభూతములయందు విష్ణుమాయ అనుపేరు నిలిచియుండు దేవికి అనేక సార్లు నమస్కారములు. అంతేకాక సర్వభూతములందును చేతనా(తెలివి) స్వరూపమై, బుద్ధి స్వరూపమై, నిద్రా స్వరూపమై, క్షుధా(ఆకలి) స్వరూపమై, ఛాయా(ప్రతిబింబ) స్వరూపమై, శక్తి స్వరూపమై, తృష్ణా(దప్పి) స్వరూపమై, క్షాన్తి(ఓర్పు) స్వరూపమై, జాతి స్వరూపమై, లజ్జా(వినమ్రత) స్వరూపమై, శాన్తి స్వరూపమై, శ్రద్ధా(ఆసక్తి) స్వరూపమై, కాన్తి(అందము) స్వరూపమై, లక్ష్మీ(భాగ్యము) స్వరూపమై, వృత్తి స్వరూపమై, స్మృతి(జ్ఞప్తి) స్వరూపమై, దయాస్వరూపమై, తుష్టి(తృప్తి) స్వరూపమై, మాతృ స్వరూపమై, భ్రాన్తి స్వరూపమై ఉండుదేవికి పలుమార్లు భక్తితో విశ్వాసంతో నమస్కారములు.


శ్రీమార్కండేయ పురాణ దేవీమాహాత్య్మం ( శ్రీదేవీసప్తశతీ ) లో పంచమ అధ్యాయంలో దేవీనిస్తుతించే ఇరువదినొక (21) శ్లోకములు 

పైన చెప్పిన 21 శ్లోకములను నిత్యం పఠించినచో దేవి అనుగ్రహం కల్గునని పురాణవచనం.




Sunday, November 15, 2015

గో- ప్రార్థన (Go prardhana)

గో- ప్రార్థన



శ్లోll  నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయచ l
జగద్ధితాయ కృష్టాయ గోవిందాయ నమోనమః ll

శ్లోll  కీర్తనం శ్రవణం దానం దర్శనం చాపి పార్ధవ l
గవాం ప్రశ్రస్యతే వీర, సర్వపాపహరం శివం ll

శ్లోll  ఘృతక్షీర ప్రదా గావో ఘృతయోన్యో ఘృతోద్భవాః l
ఘృతనద్యో ఘృతావర్తా స్తామే సంతు సదా గ్రుహే ll

శ్లోll  ఘృతమే హ్రుదయేనిత్యం ఘృతమ్నాభ్యాం ప్రతిష్టితం l
ఘృతం సర్వేషు గాత్రేషు ఘృతం మే మనసిస్థితం  ll

శ్లోll  గావో మమాగ్రతో నిత్యం గావః ప్రుష్ఠత ఏవ చ l
గావో మే సర్వత శ్చైవగవాం మధ్యేవసామ్యహం ll

శ్లోll  ఇత్యాచమ్య జపేత్సాయం ప్రాతశ్చ పురుష స్సదా l
య దహ్నా త్కురుతేపాపం తస్మాత్ పరిముచ్యతే ll




Saturday, November 14, 2015

గోవు లో ఉన్న దేవతలు (govu lo unnadevatalu)

గోవు లో ఉన్న దేవతలు
( గోవు లో  ఉన్న సకల దేవత మూర్తులను తెలుసుకుందాం, గోవులని పూజించుకుందాం. ) 





  1. గోవుపాదము పితృ దేవతలు
  2. పిక్కలు పిడుగంటలు
  3. అడుగులు ఆకాశ గంగలు
  4. ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు
  5. కర్రి కర్రేనుగ 
  6. పోదుగు పుండరీకాక్ష
  7. సన్నుకట్టు సప్తసాగరాలు
  8. గోమయం శ్రీలక్ష్మీ
  9. పాలు పంచామృతాలు 
  10. తోక తొంబైకోటి ఋషులు 
  11. బొడ్డు పొన్నపువ్వు 
  12. కడుపు కైలాసం
  13. కొమ్ములు కోటిగుళ్లు
  14. మొగము దెష్ట
  15. వెన్ను యమధర్మరాజు
  16. ముక్కు సిరి
  17. కళ్ళు కలువరేకులు
  18. చెవులు శంఖనాదం 
  19. నాలుక నారాయణ స్వరూపం 
  20. దంతములు దేవతలు
  21. పళ్ళుపరమేశ్వరి 
  22. నోరు లోకనిధి.



వాసవీ కన్యకాష్టకం (vasavi kanyakashtakam)

వాసవీ కన్యకాష్టకం  

(వైశ్యా కుల మాత అయిన వాసవి మాత అష్టాకం )  ప్రతి నిత్యం చదవడం వాల్ల అష్టా ఐశ్వర్యలు మరియు సుమంగళిళకు సౌభగ్యము కలుగును. 




  శ్లోll నమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమోనమః l
శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమోనమః ll

శ్లోll జయాయై చంద్రరూపాయై చండికాయై నమోనమః l
శాంతిమావహనోదేవి వాసవ్యైతే నమోనమః ll

శ్లోll నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమోనమః l
పాహినః పుత్రదారాంశ్చ వాసవ్యైతే నమోనమః ll

శ్లోll అపర్ణాయై నమస్తేస్తు, కౌస్తుంభ్యైతే నమోనమః l
నమః కమల హస్తాయై, వాసవ్యైతే నమోనమః ll

శ్లోll చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమోనమః l
సుముఖాయై నమస్తేస్తు, వాసవ్యైతే నమోనమః ll

శ్లోll కమలాయై నమస్తేస్తు, విష్ణునేత్ర కులాలయే l
మృడాన్యైతే నమస్తేస్తు, వాసవ్యైతే నమోనమః ll

శ్లోll నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరి l
శ్రియం నోదేహి మాతస్త్వం  వాసవ్యైతే నమోనమః ll

శ్లోll త్వత్పాదపద్మ విన్యాసం చంద్రమండల శీతలమ్  l
గృహేషు సర్వ దాస్మాకం దేహి శ్రీ పరమేశ్వరీ ll





Friday, November 13, 2015

శ్రీ కార్తికేయ స్తొత్రం (Kartikeya stotram)

ప్రజ్ఞా వివర్ధన శ్రీ కార్తికేయ స్తొత్రం
( ఈ శ్లోకన్ని చిన్న పిల్లలతో చాదివించడం వాల్ల వారి బుద్ధి పెరుగుతుంది, జ్ఞానం వికసిస్తునది, చదువులో బాగారాణిస్తారు. ) 



శ్రీ స్కంద ఉవాచ:

శ్లోll యోగిశ్వరో మహసీనః కార్తికేయోగ్ని నందన l
స్కన్దః కుమారః సేనాని స్వామి శంకర సపంద ll

శ్లోll గాంగేయ స్తామ్రచూడచ్చ బ్రహ్మచారి శిఖి ధ్వజః l
తారకారి రుమాపుత్రః క్రొన్చారిధ్య పడాసనః ll

శ్లోll శబ్ద బ్రహ్మ సముద్రశ్చ సిందుః సారస్వతో గుహః l
సనత్కుమారో భగవాన్ భోగ మోక్షఫలప్రదః ll

శ్లోll శరజన్మా గుణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ l
సర్వాగమ ప్రణేతాచ వాంచితార్ధ ప్రదర్శనః ll

శ్లోll అష్టావింశతి నామాని మదీయానీతి యః పఠేత్ l 
ప్రత్యుషం శ్రద్ధయా యుక్తో ముక్తో వాచస్పతిర్భవేత్ ll

శ్లోll మహ మంత్ర మయా నీటి మామ నామానుకీర్తనం l
మహప్రజ్ఞా మవాప్నోతి నాత్రకార్యం విచారణ ll

శ్రీ మత్కార్తికేయ స్తొత్రం సంపూర్ణం ఈ 28 పేర్లు ఎవరుచదువుతారో వారికిచదువు, బుద్ధి పెరుగుతుంది.



Thursday, November 12, 2015

Eka Sloki Sundarakanda

ఏక శ్లోకి సుందరకాండ
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )



తీర్త్వాక్షార పయోనిధిం; క్షణమథోగత్వా శ్రియః సన్నిధిమ్;

దత్త్వారాఘవ ముద్రికా మపశుచం; క్రుత్వాప్రవిశ్యాటవీం;

భఙ్త్వాఅనేకతరూం, నిహత్యబహుళాం రక్షోగణం స్తత్పురీమ్;

దగ్ధ్వాఅదాయమణి రఘాద్వహమగాద్వీరో హనూమాన్కపిః


ఫలితం : దీనిని ఎవరు భక్తితొ ప్రతి నిత్యం ఎవరు చదువుతరొ వారికి కష్టాలు దూరమౌతయి సంతోషం ప్రాప్తిస్తుంది.



Wednesday, November 11, 2015

అర్ధనారీశ్వరస్తోత్రం (ardhanariswara stotram)

అర్ధనారీశ్వరస్తోత్రం



శ్లో ll  చామ్పేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ l
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  కస్తూరికాకుంకుమచర్చితాయై చితా రజః పుఞ్జవిచర్చితాయ l
కృతస్మరాయై వికృతస్మరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణితనూపురాయ l
హేమాంగదాయై భుజగాంగదాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  విశాలనీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ l
సమేక్షణాయై విషమేక్షణాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  మన్దారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకన్ధరాయ l
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  అమ్భోధరశ్యామలకున్తలాయై తటిత్ర్పభాతామ్రజటాధరాయ l
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ l
జగజ్జనన్యై జగదేకపిత్రే నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహపన్నగభూషణాయ l
శివాన్వితాయై చ శివాన్వితాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువిదీర్ఘజీవీ l
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదాచాస్య సమస్తసిద్ధిః ll


ఫలశ్రుతి : దీనిని భక్తితో చదివినవారికి భూమిపై చిరంజీవులై గౌరవాన్ని  సౌభాగ్యాన్ని, భార్యా భర్తలు అన్యోన్యతను కలుగజేయును.

Tuesday, November 10, 2015

గురుపాదుకా స్తొత్రం (Gurupadhuka stotram)

శ్రీ ఆదిశంకరాచార్యవిరచిత శ్రీ గురుపాదుకా స్తొత్రం



శ్లోll అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ l
వైరాగ్య సామ్రాజ్యదపూజనాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll కవిత్వ వారాశినిశాకరభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ l
దూరికృతానమ్రవిపత్తితిభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll నతా యయోఃశ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః l
మూకాశ్ర్చ వాచస్పతితాం హితాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ l
సమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ l
నృపత్వదాభ్యాం నతలోకపంకతేః నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్రరాభ్యామ్ l
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll శమాదిషట్కరపదవైభవాభ్యం సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్ l
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహసహయాక్షధురంధరాభ్యమ్ l
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ l
భోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll


Monday, November 9, 2015

శ్రీ మంగళ చండికా స్తోత్రం (mangala chamdika stotram)

శ్రీ మంగళ చండికా స్తోత్రం



శ్లోll రక్ష రక్ష జగన్మాతః దేవీ మంగళ చండికే l
హరికే విపదాం హర్ష మంగళ కారికే ll

శ్లోll హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే l
శుభే మంగళ దక్షే చ శుభే మంగళ చండికే ll

శ్లోll మంగళ మంగళ దక్షే చ సర్వమంగళ మాంగళ్యే l
సదా మంగళదేవీం సర్వేషాం మంగళాలయే ll

శ్లోll పూజ్యే మంగళ వారేచ మంగళాభీష్ట దేవతే l
పూజ్యే మంగళ భూపస్య మను వంశస్య సంతతీ ll

శ్లోll మంగళా ధిష్టితా దేవీ మంగళానాం చ మంగళే  l
సంసార మంగళాధరే మోక్ష మంగళదాయినీ ll

శ్లోll సారే చ మంగళాధారే పారేచ సర్వ కర్మణా l
ప్రతిమంగళ వరేచ పూజ్య మంగళ సుఖప్రదే ll

ఫలితం : ధన, ధాన్య, వ్యాపార అభివృధ్ధికి, కోర్టువ్యవహరల అనుకూలతకు, సకల సమస్యలపరిష్కారార్ధం .