Friday, November 20, 2015
అష్టాదశ పీఠముల ప్రార్థన (Ashtadasa pitamulu)
అష్టాదశ పీఠముల ప్రార్థన
(ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు సూర్యష్టమయం లో పఠిస్తే శ్రత్రువుల మీద విజయం, సర్వ రోగాలు దురమౌతయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. )
ఓం లంకాయాం శాంకరీదేవి ;
కామాక్షీ కాంచికాపురీ ;
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ ;
చాముండే క్రౌంచపట్టణే ;
అల్లంపురి జోగులాంబ ;
శ్రీశైలే భ్రమరాంబికా ;
కొల్హాపురీ మహలక్ష్మీ ;
మహుర్యే ఏకవీరికా ;
ఉజ్జయిన్యాం మహాకాళీ ;
పీఠికాయాం పురుహూతికా ;
ఓఢ్యాయం గిరిజాదేవి ;
మాణిక్యా దక్ష వాటికా ;
హరిక్షేత్రే కామరూపీ ;
ప్రయాగే మాధవేశ్వరీ ;
జ్వాలాయాం వైష్ణవీదేవీ ;
గయామాంగళ్య గౌరికా ;
వారణశ్యాం విశాలాక్షీ ;
కాశ్మీరేతు సరస్వతీ ;
అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రువినాశనం
సర్వ రోగహరం దివ్యం, సర్వసంపత్కరం శుభం !
గోమాహత్మ్యము ( Gomahatyamu)
గోమాహత్మ్యము
అలనాడు
- దేవేంద్రుని భార్య శచీదేవి
- బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి
- శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి
- శ్రీరాములవారి భార్య సీతాదేవి
- గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణిదేవి
- ఈశ్వరుని భార్య పార్వతీదేవి
- వశిష్టులవారి భార్య అరుంధతీదేవి
వీరంతా గూడి ప్రాతః కాలమునలేచి ఆడవారు చేసిన పాపములు ఎలగును పోవును క్రుష్ణా? అని అడిగినారు.
ప్రొద్దుటేలేచి గోవుమాహత్మ్యము పఠించుకుంటే సకలపాపములు పోవును.
అంటుకలిపిన పాపము, ముట్టుకలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగీ ఎరిగకచేసిన పాపము అంతా కూడా పరిహరము.
మధ్యాహ్నకాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే
సహస్ర గుళ్ళలో దీపారధన చేసినట్లు, జాన్మంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చెసినట్లు.
అర్థరాత్రివేళపఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే
యమభాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవుమాహాత్మ్యము పఠించిన పణతివస్తుంది.
ఏలాగున వస్తుంది? ఏ తీరునవస్తుంది?
కనకాంబరాలతో కదులుతో తులా భారలతో తులతూగుతూ తన భర్తను తలచుకోని తనపుత్ర పుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్రబంధువులనను కొని, లక్ష్మీ మహలక్ష్మీ ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు, పారాణి, అక్షతలు, గంధములు యిచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుపముక్కు కాకులను వెనక్కుత్రోసేసి, మండే మండే పెనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశి, గయ, ప్రయాగ అన్నీ చూసుకొని, వైకుంఠమునకు వెళ్ళినది, విన్నవారికి విష్ణులోకము , చెప్పిన వారికి పుణ్యలోకము.
ఏకవింశతి దేవీస్తుతి శ్లోకీ (Devistuti)
ఏకవింశతి దేవీస్తుతి శ్లోకీ
- యాదేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు చేతనే త్యభిధీయతే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు తృష్టారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
- యాదేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
తా : సర్వభూతములయందు విష్ణుమాయ అనుపేరు నిలిచియుండు దేవికి అనేక సార్లు నమస్కారములు. అంతేకాక సర్వభూతములందును చేతనా(తెలివి) స్వరూపమై, బుద్ధి స్వరూపమై, నిద్రా స్వరూపమై, క్షుధా(ఆకలి) స్వరూపమై, ఛాయా(ప్రతిబింబ) స్వరూపమై, శక్తి స్వరూపమై, తృష్ణా(దప్పి) స్వరూపమై, క్షాన్తి(ఓర్పు) స్వరూపమై, జాతి స్వరూపమై, లజ్జా(వినమ్రత) స్వరూపమై, శాన్తి స్వరూపమై, శ్రద్ధా(ఆసక్తి) స్వరూపమై, కాన్తి(అందము) స్వరూపమై, లక్ష్మీ(భాగ్యము) స్వరూపమై, వృత్తి స్వరూపమై, స్మృతి(జ్ఞప్తి) స్వరూపమై, దయాస్వరూపమై, తుష్టి(తృప్తి) స్వరూపమై, మాతృ స్వరూపమై, భ్రాన్తి స్వరూపమై ఉండుదేవికి పలుమార్లు భక్తితో విశ్వాసంతో నమస్కారములు.
శ్రీమార్కండేయ పురాణ దేవీమాహాత్య్మం ( శ్రీదేవీసప్తశతీ ) లో పంచమ అధ్యాయంలో దేవీనిస్తుతించే ఇరువదినొక (21) శ్లోకములు
పైన చెప్పిన 21 శ్లోకములను నిత్యం పఠించినచో దేవి అనుగ్రహం కల్గునని పురాణవచనం.
Subscribe to:
Posts (Atom)