Showing posts with label Nityam slokas. Show all posts
Showing posts with label Nityam slokas. Show all posts

Saturday, December 26, 2015

హయగ్రీవ స్తుత్తి

హయగ్రీవ స్తుత్తి




శ్లోll   ఙ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం l
        ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ll


సకల విద్యాప్రాప్తికి నిత్యం ఈ శ్లోకన్ని చదివించండి.


Friday, December 25, 2015

దేవీ దశనామ స్తోత్రం

దేవీ దశనామ స్తోత్రం



శ్లోll గంగాభవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ,
       రాజరాజేశ్వరీ బా లా శ్మామలా లలితాదశ.

అమ్మ అనుగ్రహం కలగాలి అంటే నిత్యం ఈ శ్లోకన్ని ఫాటించలి.

Tuesday, December 1, 2015

Eka Sloka Mahabharatamu

ఏకశ్లోకి మహాభారతము
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )




అదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం - లాక్షాగృహేదాహనం

ద్యూత స్త్రీహరణం - వనేవిహరణం -మత్స్యాలయేవర్తనం

లీలగోగ్రహణం - రణేచేవిజయం - సంథిక్రియా జృంభణం

పశ్చాద్భీష్మసుయోధ నాది హననం యేతన్మహాభారతమ్. 





Friday, November 27, 2015

Eka Sloka Bhagavatamu

ఏకశ్లోకి భాగవతము
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )





ఆదౌ దేవకి దేవీ గర్భజననం - గోపీగృహే వర్ధనం

మాయాపూతన జీవీతాపహరణం - గోవర్ధనోద్దారణం

కంసచ్చేదన కౌరవాదిహననం - కుంతీసుతాన్ పాలనం

యేతద్భాగవతం పురాణకధితం శ్రీకృష్టలీలమృతం . 



Thursday, November 26, 2015

Eka Sloka Ramayanamu

ఏకశ్లోకి రామాయణము
( నిత్యం పటించవలిసిన శ్లోకం )




ఆదౌరామ తపోవనాది గమనం - హత్వామృగంకాంచనం

వైదేహీహరణం - జటాయుమరణం - సుగ్రీవసంభాషణం

వాలీనిగ్రహణం - సముద్రతరణం -లంకాపురీదాహనం

పశ్చాద్రావణ కుంభకర్ణహాననం యేతద్దిరమాయణమ్.




Monday, November 23, 2015

Eka Sloka Bhagavatgita

ఏకశ్లోకి భగవద్గీత
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )



ఓం యత్రయోగీశ్వరః కృష్టోయత్రపార్థోధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ

పార్ధాయ ప్రతిబోధితాం - భగవతే నారాయణేన స్వయమ్ 

వ్యాసేన గ్రథితాం - పురాణమునినా మద్యేమహాభారతమ్ 

అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశధ్యాయినీ

మంబత్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్. 




Friday, November 20, 2015

గోమాహత్మ్యము ( Gomahatyamu)

గోమాహత్మ్యము



అలనాడు 

  1. దేవేంద్రుని భార్య శచీదేవి
  2. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి
  3. శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి
  4. శ్రీరాములవారి భార్య సీతాదేవి
  5. గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణిదేవి
  6. ఈశ్వరుని భార్య పార్వతీదేవి 
  7. వశిష్టులవారి భార్య అరుంధతీదేవి

వీరంతా గూడి ప్రాతః కాలమునలేచి ఆడవారు చేసిన పాపములు ఎలగును పోవును క్రుష్ణా? అని అడిగినారు.

ప్రొద్దుటేలేచి గోవుమాహత్మ్యము పఠించుకుంటే సకలపాపములు పోవును.
అంటుకలిపిన పాపము, ముట్టుకలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగీ ఎరిగకచేసిన పాపము అంతా కూడా పరిహరము.

మధ్యాహ్నకాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే

సహస్ర గుళ్ళలో దీపారధన చేసినట్లు, జాన్మంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చెసినట్లు.

అర్థరాత్రివేళపఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే 

యమభాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవుమాహాత్మ్యము పఠించిన పణతివస్తుంది.

 ఏలాగున వస్తుంది? ఏ తీరునవస్తుంది?

 కనకాంబరాలతో కదులుతో తులా భారలతో తులతూగుతూ తన భర్తను తలచుకోని తనపుత్ర పుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్రబంధువులనను కొని, లక్ష్మీ మహలక్ష్మీ ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు, పారాణి, అక్షతలు, గంధములు యిచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుపముక్కు కాకులను వెనక్కుత్రోసేసి, మండే మండే పెనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశి, గయ, ప్రయాగ అన్నీ చూసుకొని, వైకుంఠమునకు వెళ్ళినది, విన్నవారికి విష్ణులోకము , చెప్పిన వారికి పుణ్యలోకము. 




Saturday, November 14, 2015

గోవు లో ఉన్న దేవతలు (govu lo unnadevatalu)

గోవు లో ఉన్న దేవతలు
( గోవు లో  ఉన్న సకల దేవత మూర్తులను తెలుసుకుందాం, గోవులని పూజించుకుందాం. ) 





  1. గోవుపాదము పితృ దేవతలు
  2. పిక్కలు పిడుగంటలు
  3. అడుగులు ఆకాశ గంగలు
  4. ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు
  5. కర్రి కర్రేనుగ 
  6. పోదుగు పుండరీకాక్ష
  7. సన్నుకట్టు సప్తసాగరాలు
  8. గోమయం శ్రీలక్ష్మీ
  9. పాలు పంచామృతాలు 
  10. తోక తొంబైకోటి ఋషులు 
  11. బొడ్డు పొన్నపువ్వు 
  12. కడుపు కైలాసం
  13. కొమ్ములు కోటిగుళ్లు
  14. మొగము దెష్ట
  15. వెన్ను యమధర్మరాజు
  16. ముక్కు సిరి
  17. కళ్ళు కలువరేకులు
  18. చెవులు శంఖనాదం 
  19. నాలుక నారాయణ స్వరూపం 
  20. దంతములు దేవతలు
  21. పళ్ళుపరమేశ్వరి 
  22. నోరు లోకనిధి.



Thursday, November 12, 2015

Eka Sloki Sundarakanda

ఏక శ్లోకి సుందరకాండ
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )



తీర్త్వాక్షార పయోనిధిం; క్షణమథోగత్వా శ్రియః సన్నిధిమ్;

దత్త్వారాఘవ ముద్రికా మపశుచం; క్రుత్వాప్రవిశ్యాటవీం;

భఙ్త్వాఅనేకతరూం, నిహత్యబహుళాం రక్షోగణం స్తత్పురీమ్;

దగ్ధ్వాఅదాయమణి రఘాద్వహమగాద్వీరో హనూమాన్కపిః


ఫలితం : దీనిని ఎవరు భక్తితొ ప్రతి నిత్యం ఎవరు చదువుతరొ వారికి కష్టాలు దూరమౌతయి సంతోషం ప్రాప్తిస్తుంది.