Friday, November 20, 2015

గోమాహత్మ్యము ( Gomahatyamu)

గోమాహత్మ్యము



అలనాడు 

  1. దేవేంద్రుని భార్య శచీదేవి
  2. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి
  3. శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి
  4. శ్రీరాములవారి భార్య సీతాదేవి
  5. గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణిదేవి
  6. ఈశ్వరుని భార్య పార్వతీదేవి 
  7. వశిష్టులవారి భార్య అరుంధతీదేవి

వీరంతా గూడి ప్రాతః కాలమునలేచి ఆడవారు చేసిన పాపములు ఎలగును పోవును క్రుష్ణా? అని అడిగినారు.

ప్రొద్దుటేలేచి గోవుమాహత్మ్యము పఠించుకుంటే సకలపాపములు పోవును.
అంటుకలిపిన పాపము, ముట్టుకలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగీ ఎరిగకచేసిన పాపము అంతా కూడా పరిహరము.

మధ్యాహ్నకాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే

సహస్ర గుళ్ళలో దీపారధన చేసినట్లు, జాన్మంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చెసినట్లు.

అర్థరాత్రివేళపఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే 

యమభాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవుమాహాత్మ్యము పఠించిన పణతివస్తుంది.

 ఏలాగున వస్తుంది? ఏ తీరునవస్తుంది?

 కనకాంబరాలతో కదులుతో తులా భారలతో తులతూగుతూ తన భర్తను తలచుకోని తనపుత్ర పుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్రబంధువులనను కొని, లక్ష్మీ మహలక్ష్మీ ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు, పారాణి, అక్షతలు, గంధములు యిచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుపముక్కు కాకులను వెనక్కుత్రోసేసి, మండే మండే పెనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశి, గయ, ప్రయాగ అన్నీ చూసుకొని, వైకుంఠమునకు వెళ్ళినది, విన్నవారికి విష్ణులోకము , చెప్పిన వారికి పుణ్యలోకము. 




No comments:

Post a Comment