Thursday, October 15, 2015

కాణిపాకం వరసిద్దివినాయక స్వామి (Kanipakam)

కాణిపాకం వరసిద్దివినాయక స్వామి

ప్రాంతం- చిత్తురు జిల్లాలోని కాణిపాకం
దైవం- వరసిద్దివినాయక స్వామి
ఆలయం నిర్మించిన సం-  11వ శతాబ్దం
మాట్లాడే భాషలు-  తెలుగు,తమిళం,ఇంగ్లిష్
      తనునమ్మి వచ్చిన భక్తులను చల్లగా కాపాడుతూ వారికి సిద్ది, బుద్దులను ప్రసాదించే విఘ్ననాయకుడు శ్రీకాణిపాకం వినాయకుడు.కాణిపాక క్షేత్రం చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో కాణిపాకం అనే గ్రామంలో కొలువైవుంది.స్వామివారు ఇక్కడబావిలో స్వయంభూగా వెలిసాడు.ఇంచుమించు తిరుపతిని దర్శించిన ప్రతీ భక్తుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళడం అనవాయితిగా వస్తుంది.ఈ క్షేత్రం యొక్క విశేషమేమిటంటే స్వామివారు కొలువైవున్న బావిలోనీరు భూభాగానికి సమానంగా ఉంటుంది.అదే నీటిని భక్తులకు తీర్ధం కింద ఇస్తారు ఇక్కడ అర్చకులు.మరో విశేషమేమిటంటే ఎపూడూ నీళ్ళతో ఉండే ఈ బావిచుట్టూపక్కల ఉన్న ప్రదేశంలో 40 అడుగుల లోతు తవ్వినా నీరు దొరకదట. స్వామివారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చోళరాజు అయిన కుల్తుంగ చోళుడు నిర్మించాడని తెలుస్తుంది.ఈ ఆలయం యొక్క పూర్వాపరాలను తెలిపే స్ధలపురాణమ్ను ఒక్కసారి పరిశిలిస్తే...


స్ధలపురాణం -     
                                 పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో మూగ,చెవిటి,గుడ్డి వారైన ముగ్గురు అన్నదమ్ములకు కాణి మడి ఉండేదట.అభూమిలో ఏతంతొక్కడానికి ఒక చిన్నబావిని తవ్వరట.అయితే కొంతకాలానికి ఆప్రాంతంలో కరువు రావడంతో నీరు చాలకపోవడంతో బావిని ఇంకాలోతుగా తవ్వాలని నిర్ణయించుకుని ముగ్గురూ కలిసి తవ్వడం ప్రారంభించారట.తవ్వగా తవ్వగా కొంతసేపటికి గునపం రయికి తగిలి ఉవ్వెత్తున రక్తం వారిమీద చిందిందట.ఆ రక్తం మీద పడగానే మూగ,గుడ్డి,చెవిటి వారైన ఆ అన్నదమ్ములకు వారి వైకల్యాలు పోయి మాములుగా తయారయ్యారట.ఈవార్త ఆప్రాంతం అంతా దావానంలా వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా వచ్చి అక్కడ ఉన్న మట్టిని శుభ్రపరిచి చుడంగానే వారికి వినాయక విగ్రహం కనిపించిందట. దీనితో ఆ విగ్రహనికి ఆలయం నిర్మించారట.ఇప్పటికి స్వామి అంతరాలయం బావిలోనే ఉంటుంది.


కాణిపాకం చుట్టూ ఉన్న ఆలయాలు -


వరదరాజస్వామి ఆలయం

మణికంటెశ్వరస్వామివారి ఆలయం
ఆంజనేయస్వామి ఆలయం


దగ్గరలో ఉన్న ఆలయాలు -



అత్దగిరి ఆంజనేయస్వామి(22కిమీ) -తవనంపల్లి

సిరిపురం (55కిమీ) -నారాయణిపట్నం
బోయకోండ గంగమ్మ ఆలయం - బొయకొండ

వెంకటెశ్వరస్వామి(65కిమీ) - తిరుపతి


ఇక్కడ నిర్వహించు పండుగలు ఉత్సవాలు -

కాణిపాకంలో వినాయకచవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.20 రోజులు నిర్వహించే ఈ ఉత్సవాలను చూడటానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారు.

ఉత్సవాలు - వాహనాలు -
గ్రామొత్సవం హంసవాహనం
రధోత్సవం నెమలివాహనం
తిరు కళ్యాణం మూషికవాహనం
శేషవాహనం
వృషభవాహనం
గజవాహనం

ఎంతదూరం-ఎలా వెళ్ళాలి ?

తిరుపతి -65 కిమి
చిత్తూరు -12 కిమి
చెన్నై -165 కిమి
హైదరాబాద్ -562కిమి
విజయవాడ - 386 కిమి

ఎలావెళ్ళాలి ?
రాష్ట్రంలోని అన్నిప్రాంతాలనుండి కాణిపాకకు రవాణా సౌకర్యం కలదు.ఈక్షేత్రానికి అనేక మార్గాల ద్వారా చేరుకొవచ్చు.

రోడ్డు మార్గం ద్వారా -
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనుండి కాణిపాకకు రోడ్డు మార్గం కలదు.వివిధ ప్రాంతాల నుండి ఏ.పి.యస్.ఆర్.టీ.సి బస్సులు నడుపుతుంది.ఇంకా తిరుపతి నుండి క్యాబ్లు,జిప్లలో ఇక్కడికి చేరుకోవచ్చు.

రైలుమార్గం ద్వారా -
రైలుమార్గ ద్వారా చేరుకొవాలనుకునేవారు తిరుపతి స్టేషన్ లో దిగి ఇక్కడికి చేరుకొవచ్చు.

ప్లైట్ ద్వారా -
ప్లైట్ ద్వారా కాణిపాకం చేరుకోవాలనుకునేవారు దగ్గరలోని ఎయిర్ పోర్ట్ రేణి గుంట నుండి ఇక్కడికి చేరుకోవచ్చు.



తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి (Tirupati)



తిరుపతి

ప్రాంతం- చిత్తూరు జిల్లాలోని తిరుపతి
దైవం- శ్రీనివాసుడు
ఆలయం నిర్మించిన సం-  క్రీశ 300
మాట్లాడే భాషలు-    తెలుగు,తమిళం,ఇంగ్లిష్


           ఈకలియుగంలోభక్తుల కొంగు బంగారమై కోరికలు తిర్చే ఆపదమొక్కులవాడు శ్రీవెంకటేశ్వరస్వామి.ఆయన నామం ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి.స్వామి నామం ఒక్కసారి పఠిస్తెచాలు సర్వశూభాలు సిద్దిస్తాయి.శ్రీనివాసుని మహిమలకు అన్నమయ్య,త్యాగయ్య,వేంగమాంబ వంటి వారు తమ కిర్తనలతో లోకానికి చాటి చెప్పారు.అంతటి పరమపావనమైన స్వామి వారి గురించి ఒకసారి తెలుసుకుందాం.శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై వుంది.స్వామి వారిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటున్నారు.ప్రపంచంలోనే అటు ఆదాయంలోనూ ఇటు భక్తులు సందర్శించడంలోనూ రెండవ స్థానంలో ఉంది.


స్ధల పురాణం -

                                          శాశానాల ప్రకారం స్వామి వారి ఆలయాన్ని క్రీశ.300లో నిర్మించారని తెలుస్తుంది.ఆతరువాత పల్లవులు,చోళులు,విజయనగర రాజులు ఇలా ఎంతో మంది రాజవంశాల వారు ఈ ఆలయాన్ని అభివృద్ది చేస్తూ వచ్చారు.1517లో శ్రీ కృష్ణదేవరాయిలు స్వామి వారిని దర్శించి ఎన్నో విలువైన కానుకలను సమర్పించాడు.

     
                          కలియుగంలో ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించడానికి గోవిందుడు స్వయంభూవుగా వెలిసాడు.స్వామివారిసేవలో తరించడానికి దేవతలు ఏడుకొండలుగా మారారు.అవే శేషాద్రి,నిలాద్రి,గరుడాద్రి,అంజనాద్రి,నారాయణాద్రి,వృషభాద్రి,వెంకటాద్రి. ఆదిశేశుడిగా వరం ఇచ్చిన కారణంచే శ్రీనివాసుడు శేశున్ని కొండగా మార్చి ఆ కొండమిదే కొలువై ఉండి భక్తులను కాపాడుతున్నాడు అదే శేషాద్రి.



      ఆ తరువాత ఆలయాన్ని అభివృద్ది పరచడానికి ప్రభుత్వం 1932లో తిరుమల తిరుపతి దేవస్ధానం(టి.టి.డి)ని ఏర్పాటు చేసింది.అప్పటినుండి స్వామివారి నిత్యపూజలు దగ్గరనుండి అన్ని కార్యక్రమాలను టీ.టి.డి నే చూస్తుంది. కేవలం తిరుపతి పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ది చెందింది.తిరుమల చుట్టూ దట్టమైన అభయారణ్యం విస్తరించి ఉంది.ఇక్కడి కొండలు,లోయలు,సెలయెరులు మనసుకు ఎంతో అహ్లదాన్ని కలిగిస్తాయి.తిరుమల తిరుపతిలో బాలాజీ ఆలయమే కాక గోవిందరాజస్వామి ఆలయం,వరహస్వామి ఆలయం,కోదండ రామాలయం,పాపవినాశనం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శ్రీనివాసునికి వచ్చిన ఆదాయంలో ఆలయ అభివృద్దితోపాటు టీ.టి.డి అనేక మంచి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.దేవాలయాలను అభివృద్ది చేయడానికి నిధులు సమకూర్చడం,హిందూ మత వ్యాప్తికి కృషి చేయడం,పేద విధ్యార్ధులకు చదువు చెప్పించడం,పేదలకు వివాహాలు జరిపించడం వంటి ఎన్నో చేపడుతుంది.

తిరుపతిలో దర్శించవలసిన ఆలయాలు -
1.
శ్రీవరాహస్వామి ఆలయం
2.
శ్రీఅంజనేయస్వామి ఆలయం
3.
స్వామివారి పుష్కరిణి


తీర్ధాలు -
1.
ఆకాశగంగ తీర్ధం 2.పాపనాశనం తీర్ధం 3.కుమారధర తిర్ధం 4.పాండవ తీర్ధం 5.తుంబుర తీర్ధం 6.చక్ర తీర్ధం 7.రామకృష్ణ తీర్ధం 8.వైకుఠ తీర్ధం 9.శేష తీర్ధం 10.పసుపు తిర్ధం 11.సీతమ్మ తీర్ధం 12.జాపాని తీర్ధం 13.శంకసనాదన తీర్ధం

తిరుపతిలో చుట్టూ ఉన్న ఆలయాలు -
1.
శ్రీగోవిందరాజస్వామి ఆలయం - తిరుపతి
2.
శ్రీకొదండరామస్వామి ఆలయం - తిరుపతి
3.
శ్రీకపిలేశ్వరస్వామి ఆలయం - తిరుపతి
4.
శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం - తిరుచనూరు
5.
శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం - శ్రీనివాసమంగాపురం
6.
శ్రీవేదనరసిమ్హస్వామి ఆలయం - నాగాలాపురం
7.
శ్రీఅంజనేయస్వామి ఆలయం -అప్పలాయగుంట


వేకటేశ్వరస్వామికి నిత్యం జరిగే సేవలు -
సుప్రభాత సేవ ఉదయం 2గం ల 30ని లకు
తోమాల సేవ ఉదయం 3గం ల 30ని లకు
అర్చన ఉదయం 4గం ల 30ని లకు


ఉత్సవమూర్తికి జరుగు సేవలు -
1.
కళ్యాణోత్సవం 2.ఆర్జితబ్రహ్మౌత్సవం 3.డోలోత్సవం 4.వసంతోత్సవం 5.సహస్రదీపాలంకరణ సేవ 6.ఏకాంత సేవ

బ్రహ్మౌత్సవాల సందర్భంగా స్వామివారు సర్వాలంకారభూషితుడై వివిధ రూపాలలో వివిధ వాహనాలలో దర్శనమిస్తూ తిరుమాడవీధులలో భక్తులను అలరిస్తారు.


ఆయావాహనాల వివరాలు -
1.
మొదటి రోజు ద్వజారోహణం(ఉదయం) పెదశేష వాహనం(సాయంత్రం)
2.
రెండవ రోజు చినశేష వహనం హంస వాహనం
3.
మూడవ రోజు సిమ్హ వాహనం ముత్యపు పందిరి వాహనం
4.
నాల్గవ రోజు కల్పవృక్ష వాహనం శివభూతాల వాహనం
5.
ఐదవ రోజు మొహిని అవతారం గరుడ సేవ
6.
ఆరవ రోజు హనుమంత వాహనం స్వర్ణరధం,గజవాహనం
7.
ఏడవ రోజు సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
8.
ఎనిమిదవ రోజు రధోత్సవం అశ్వ వాహనం
9.
తోమ్మిదవ రోజు పల్లకీ ఉత్సవం బంగారు తిరుచ్చి ఉత్సవం
చక్ర స్ధానం ద్వజారోహణం


తిరుపతి ఎలా వెళ్ళాలి ?
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి దూరముల వివరాలు
1.
హైదరాబాద్ నుండి - 554కిమీ
2.
వైజాగ్ నుండి -735 కిమీ
3.
చెన్నై నుండి - 139 కిమీ
4.
బెంగూళూరు నుండి -247 కిమీ
5.
ముంబాయి నుండి - 1140 కిమీ


వివిధ మార్గాల ద్వారా -
1.ట్రైన్ మార్గం ద్వారా -
తిరుపతికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ట్రైన్ సౌకర్యం ఉంది.తిరుపతికి దగ్గరలోనే రేణిగుంట జంక్షన్ ఉంది.
హైదరాబాద్ నుండి నారాయనాద్రి ఎక్స్ ప్రెస్(ఉదయం 6గం"ల 30ని"కు)
పద్మావతి ఎక్స్ ప్రెస్
రాయలసీమ ఎక్స్ ప్రెస్
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
కాచిగుడ ఎక్స్ ప్రెస్


2.రోడ్డు మార్గం ద్వారా -
తిరుపతికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం కలదు. ఎ.పి.యస్.ఆర్.టి.సి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు.

3.ఆకాశమార్గం ద్వారా -
విమానం ద్వారా తిరుపతికి చేరుకొవాలనుకునేవారు తిరుపతికి దగ్గరలోని రేణిగుంట విమానశ్రయానికి చేరుకోవాలి.అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకొవచ్చు.

ఎక్కడ ఉండాలి ?
తిరుమలలో భక్తులు ఉండటానికి విలుగా టి.టి.డి కాటేజ్ లలొ వసతి సౌకర్యం కల్పిస్తుంది.ఇంకా సౌకర్యంగా కావలనుకునేవారి కోసం గెస్ట్ హౌస్ల్ కు పరిమితమైన అద్దె వసూలు చేస్తుంది.
ఇవే కాక ప్రముఖమైన హొటల్స్ కూడా ఉన్నాయి.
1.
సింధూరి హోటల్
2.
గ్రాండ్ హోటల్
3.
హోటల్ కళ్యణ్ రెసిడెన్సీ

ఇంత పరమపావనమైన తిరుమల క్షేత్రాన్ని మనమూ ఒకసారి దర్శించి తరిద్దామామరి.

           


                                                గోవిందా........ గోవిందా........ గోవిందా........