Saturday, October 17, 2015

శ్రీశైలం బ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి (Srisailam)



ప్రాంతం- కర్నూలు జిల్లాలోని శ్రీశైలం
దైవం- బ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి
ఆలయం నిర్మించిన సం-  1 వ శతాబ్దం

కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారమై శ్రీ శైలముపై భ్రమరాంబికా సమేతుడై కొలువుదీరి ఉన్నాడు మల్లిఖార్జున స్వామి.ఎంతో పరమ పావనమయిన ఈ క్షేత్రం భారతదేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో భ్రమరాంబికా అమ్మవారి పీఠం ఒకటి.ఇక్కడ స్వామి వారు స్వయంభువుగా వెలిసారు.ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అనే పేరు ప్రసిద్ది.ఈ పుణ్య క్షేత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు చేసిన పాపాలన్ని సమసిపోయి ముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాడ నమ్మిక.




     
ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ ప్రాచీన పుణ్య క్షేత్రం కర్నూలు జిల్లాలోని నల్లమల లోని దట్టమయిన అటవీ ప్రాంతంలో కృష్టా నదీ తీరంలో సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తులో కలదు.అలాగే శ్రీశైల శిఖరం సముద్రమట్టానికి 2300 అడుగుల ఎత్తులో ఉంది.ఇక్కడ మరో విశేషమేమిటంటే ఇక్కడ నివశించే కొండ జాతి వారు మల్లన్నను తమ అల్లునిగా భ్రమరాంబికా అమ్మవారిని తమ కూతురిగా భావిస్తారు.అలయంలో పూజలలో కూడా వీరు పాలు పంచుకుంటారు.ఇక్కడ శివరాత్రి సంధర్భంగా నిర్వహించే రధోత్సవంలో రధాన్ని వీరే లాగుతారు.స్వామివారి ఆలయాన్ని- శతవాహనులు, యుక్ష్వాకులు,పల్లవులు,కాకతీయులు,విజయనగరాధీసులు మొదలయిన రాజవంశాల వారు అభివృద్ది చేస్తూ వచ్చారు.
     
ఈ ఆలయం గురించి అనేక పురాణాల్లో ప్రస్తావన ఉంది.స్వామి వారిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై వచ్చి దర్శించుకున్నాడట.ఆలాగే ద్వాపర యుగంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించుకుని స్వామి వారి కృపకు పాత్రులయ్యారట.ఎంతో మంది ఋషి పుంగవులు స్వామి ఆలయం ఉన్న ప్రాంతంలో తపమొనరించి ముక్తి పొదారట.అధేవిదంగా శ్రీ శంకారాచార్యులు వారు స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి మీద భ్రమరాంబికాష్టకాన్ని,శివునిపై శివానందలహరిని రంచించారు.

స్థల పురాణం-

     ఈ ప్రాంతంలో శిలాదుడనే మహర్షి శివిని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపమునకు మెచ్చి ప్రత్యక్షమై ఏమి వరము కావాలనో కోరుకోమని అడిగెను.అపుడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత పుత్రుడు పొందేలా వరం ప్రాసాదించు అని కోరుకున్నాడు.అంత బోలా శంకరుడయిన పరమశివుడు శిలాదుడుకి వరం ప్రాసదించి అంతర్ధానమయ్యెను.తదనంతర కాలంలో శిలాదుడికి నందీశ్వరుడు,పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు.వీరిలో పర్వతుడు స్వామి వారి గురించి మరలా తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయ్యు ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడిగెను.అంత పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా.. నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువుండేలా వరం ప్రసాదించు అని అడిగెను.అడిగిందే తడవుగా వరాలు ప్రసాదించే బొలా శంకరుడు వరం ప్రసాదించి అక్కడే ఉండి పోయను.దానితో కైలాసం ఉన్న పార్వతి,ప్రమద గణాలు కూడా స్వామి వారి బాటనే పట్టి ఇక్కడే కొలువుదీరారు.ఇక్కడ పరమేశ్వరుడు మల్లిఖార్జునిగా,పార్వతీ దేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిసారు.
     
ఇంకా స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది.పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు.ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది.ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ.. నేను మీ శిరముపై ఉంచిన మల్లిపూల దండ ఎన్నటికీ వాడి పోకుండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు.శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు

ఎలా వెళ్ళాలి?

                    ఇది సుమారు దక్షిణ హైదరాబాద్ కు 212 km, కర్నూలు నుండి 179 km .