సోమారామము
దేశము: భారత్
రాష్ట్రం: ఆంధ్ర ప్రదేశ్
జిల్లా: పశ్చిమగోదావరి
ప్రదేశము: భీమవరంపశ్చిమగోదావరి
పంచారామాల్లో
ఒకటైన భీమారామము, భీమవరమునకు
రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో కలదు. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని
స్థలపురాణంలో చెప్పబడినది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు.
ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.
స్థలపురాణం:
త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి పడిందని. అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయింది. ఈ లింగం చంద్ర ప్రతిష్టితమని విశ్వసొంచబడుతుంది.ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది.
ఆలయ ప్రశస్థి:
చాళుక్య భీముడు ఈ
దేవాలయానికి ప్రాకారాలను , గోపురాన్నినిర్మించాడనడానికి
చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలువబడుతుంది. ఇక్కడి
శివలింగ చంద్రప్రయిష్టితం కనుక సోమేశ్వరం అనికూడా పిలువబడుతుంది. భక్త సులభుడైన
పరమశివుడు ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి
అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలోని చంద్ర
పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
ఆలయంలో
ప్రత్యేకతలు:
శ్వేతవర్ణంలో
కనిపించే ఈ లింగము కృమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి భూడిద లేదా గోధుమ వర్ణమునకు
మారిపోతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ
దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు
కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మర్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే
తెలుస్తుంది. ఆలయపు ముందు బాగమున కోనేరు కలదు ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక
నందీశ్వరుని విగ్రహము కలదు ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం
కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు
అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు
సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో
అన్నపూర్ణాదేవి ఉంటుంది.
ప్రత్యేక
ఉత్సవాలు:
ప్రతి ఏడాది
ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు
జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.
చేరుకునే మార్గం:
విజయవాడ, ఏలూరు నుండి భీమవరం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. గుణుపూడి ఒక చిన్న గ్రామం, కానీ ఇప్పుడు, భీమవరం యొక్క భాగం,భీమవరం చేరుకున్నాక అక్కడ నుండి ఆటో లో గుణుపూడి వెళ్ళాలి.
కార్తీక లో మాసం APSRTC ఒకే రోజు అన్ని పంచారామాలు కవర్ అయ్యేలాగా ప్రత్యేక పర్యటన బస్సులు నిర్వహిస్తుంది.భీమవరం రైల్వే స్టేషన్ సోమేశ్వర స్వామి ఆలయం నుండి 2km దూరంలో కలదు.
సమీప విమానాశ్రయాలు విజయవాడ / రాజమండ్రి వద్ద ఉన్నాయి.