Sunday, November 29, 2015

శ్రీ సూర్యాష్టకము (suryashtakam)

శ్రీ సూర్యాష్టకము
( ప్రతి నిత్యం పటించినచో  గ్రహ భాదలు దూరమవును )



శ్లో ll ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర l
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ll

శ్లో ll సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్  l
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్  ll

శ్లో ll లోహితం రథ మారూఢం సర్వలోక పితామహమ్  l
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్  ll

శ్లో ll త్రైగుణ్యం చ మహశూరం బ్రహ్మవిష్ణు మహేశ్వరమ్  l
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్  ll

శ్లో ll  బృంహితం తేజసాం పుంజం వాయు రాకాశమేవ చ l
ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్  ll

శ్లో ll బంధూక పుష్ప సంకాశం హరకుండల భూషితమ్  l
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్  ll

శ్లో ll తం సూర్యం లోకకర్తారం మహాతేజః ప్రదీపనమ్  l
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్  ll

శ్లో ll శ్రీ విష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదమ్  l
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్  ll

శ్లో ll సూర్యష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశ్నమ్  l
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ll

శ్లో ll ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే l
సప్తజన్మ భవే ద్రోగీ జన్మజన్మ దరిద్రతా ll

శ్లో ll స్త్రీ తైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే l
న వ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి ll

ఫలితం : ఈ స్తొత్రం నిత్యం పటించడం వల్ల గ్రహ దొషలు దూరమౌతయి, వ్యాధి భయం కలుగాదు, ధనం కోసం అయితే ధనం చేకూరుతుంది.




Saturday, November 28, 2015

మంగళగిరి

మంగళగిరి

రాష్ట్రం:        ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:         గుంటూరు
ప్రదేశము:  మంగళగిరి



                                  ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉన్నది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. మంగళగిరి పట్టణం ఒక పురపాలక సంఘం మరియు రాష్ట్ర శాసనసభ కు ఒక నియోజకవర్గ కేంద్రం.

పాలకులు:


                                 మంగళగిరి క్రీ.పూ.225 నాటికే ఉనికిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధాన్యకటకం రాజధానిగా క్రీ.పూ.225 నుండి క్రీ.శ.225 వరకు పాలించిన ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి ఒక భాగం. క్రీ.శ.225 నుండి క్రీ.శ.300 వరకు ఇక్ష్వాకులు పరిపాలించారు. ఆ తరువాత మంగళగిరి పల్లవుల ఏలుబడిలోకి వచ్చింది. పిమ్మట కంతేరు రాజధానిగా పాలించిన ఆనందగోత్రిజుల అధీనంలోకి వచ్చింది. క్రీ.శ.420 నుండి క్రీ.శ.620 వరకు విష్ణు కుండినులు మంగళగిరి ని పరిపాలించారు. రెండవ మాధవ వర్మ విజయవాడ రాజధానిగా చేసుకొని మంగళగిరిని పరిపాలించాడు. క్రీ.శ.630 నుండి చాళుక్యుల ఏలుబడి సాగింది.

                                     1182 నాటి పలనాటి యుద్ధం తరువాత మంగళగిరి కాకతీయుల పాలనలోకి వచ్చింది. 1323లో, ఢిల్లీ సుల్తానులు కాకతీయులను ఓడించాక మంగళగిరిపై సుల్తానుల పెత్తనం మొదలయింది. 1353లో, కొండవీడు రాజధానిగా రెడ్డి రాజులు పాలించారు. 1424లో, కొండవీడు పతనం చెందాక, మంగళగిరి గజపతుల ఏలుబడిలోకి వచ్చింది.

                                       1515లో శ్రీ కృష్ణదేవ రాయలు గజపతులను ఓడించిన తరువాత మంగళగిరి విజయనగర రాయల అధీనమయింది. విజయనగర రాజ్యంలోని 200 పట్టణాలలో మంగళగిరి ఒకటి. 1565లో జరిగిన తళ్ళికోట యుద్ధంతో విజయనగర రాజ్య పతనం పరిపూర్ణమైన తరువాత, మంగళగిరికి గోల్కొండ కుతుబ్‌షాహీలు ప్రభువులయ్యారు. కుతుబ్‌షాహీలు కొండవీడు రాజ్యాన్ని 14 భాగాలుగా విభజించగా వాటిలో మంగళగిరి ఒకటి. మంగళగిరి విభాగంలో 33 గ్రామాలు ఉండేవి. 1750 నుండి 1758 వరకు ఫ్రెంచి పాలనలోను, 1758 నుండి 1788 వరకు నిజాము పాలనలోను ఉన్నది.

                                        1788, సెప్టెంబర్ 18, హైదరాబాదు నవాబు అయిన నిజాము ఆలీ ఖాను గుంటూరును బ్రిటీషు వారికి ఇచ్చివేసాడు. బ్రిటీషు వారు వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ను ఈ ప్రాంతానికి జమీందారుగా నియమించారు. ఆయన లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి గోపురం నిర్మింపజేసాడు. 1788 నుండి 1794 వరకు ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారి సర్క్యూట్‌ కమిటీ మంగళగిరిని పాలించింది. 1794లో సర్క్యూట్‌ కమిటీని రద్దుచేసి, 14 మండలాలతో గుంటూరు జిల్లాను ఏర్పాటు చేసారు. 1859లో, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాతో ఏకమై, మళ్ళీ 1904, జనవరి 10న విడివడి ప్రత్యేక జిల్లాగా రూపొందింది. అప్పటినుండి మంగళగిరి గుంటూరు జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది.


లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం:




                                ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉండదు; కేవలం తెరుచుకుని ఉన్న నోరు ఆకారంలో ఒక రంధ్రం ఉంటుంది. ఆ తెరచుకొని ఉన్న రంధ్రమే పానకాల స్వామిగా ప్రజల నమ్మకం.మంగళగిరి పానకాలస్వామి కి ఒక ప్రత్యేకత ఉంది. పానకాలస్వామికి పానకం (బెల్లం, పంచదార, చెరకు) అభిషేకం చేస్తే, అభిషేకం చేసిన పానకంలో సగం పానకాన్ని స్వామి త్రాగి, మిగిలిన సగాన్ని మనకు ప్రసాదం గా వదిలిపెడతాడుట. ఎంత పానకం అభిషేకించినా, అందులో సగమే త్రాగి, మిగిలిన సగాన్ని భక్తులకు వదలడం ఇక్కడ విశేషం. అందుకనే స్వామిని పానకాలస్వామి అని పిలుస్తారు.


గాలిగోపురం:


                                  మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం రాష్ట్రంలో అత్యంత ఎత్తయినది.రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది.మంగళగిరి గాలిగోపురాన్ని తొలగించి దానిస్థానే మళ్లీ అదేరీతిలోనూతనంగా కొత్త గోపురం నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి...కేవలం 49 అడుగుల పీఠభాగంతో గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది.దీనిని 1807-09 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. ఈ రాతి కట్టడానికి అన్నీ వైపులా పగుళ్లు వచ్చాయి.గోపుర పీఠభాగం త్రీడీ లేజర్ స్కానర్‌ తో పునాదుల అంతర్భాగాన్ని స్కానింగ్ చేయించాలని భక్తులు కోరుతున్నారు.మంగళగిరి గోపురాన్ని ఈ ప్రాంత ప్రజలు వారసత్వ సంపదగా భావిస్తుంటారు.

ధర్మగుణం ఇంకా ఉంది:


                             పానకాలస్వామికి ఇక్కడ డ్రమ్ముల కొద్దీ పానకాన్ని తయారు చేస్తుంటారు. పానకం తయారీ సందర్భంగా కింద ఎంతగా ఒలికిపోయినా ఈగలు చీమలు చేరవట. సృష్టిలో ధర్మం పూర్తిగా నశించి యుగ సమాప్తి దగ్గరపడినపుడు మాత్రమే పానకం ఒలికినపుడు ఈగలు, చీమలు చేరడం ఆరంభమవుతుందని అంటారు. మద్రాసులోని సెయింట్‌ జార్జి ఫోర్ట్‌ గవర్నర్‌ రస్టెయిన్‌షామ్‌ మాస్టర్‌ మచిలీట్నం నుంచి మద్రాసు వెడుతూ 1679 మార్చి 22వ తేదిన మంగళగిరి చేరుకున్నాడు. ఆ రాత్రి ఆయన ఇక్కడే బసచేసి, ఈ మహత్తును గురించి విని, స్వయంగా కొండపైకి వెళ్లి పానకాలరాయుని సన్నిధిని పరిశీలనగా చూశారు. ఇదేదో గమ్మత్తుగా ఉందని, తనకైతే నమ్మశక్యంగా లేదన్నారు. మంగళగిరిలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. హేతువాదులు మంగళగిరి కొండ ఓ అగ్ని పర్వతమని, దీనిలో గంధకం ఉందని, ఎప్పటికైనా పేలిపోయే ప్రమాదముందని, ఆ విపత్తు నుంచి మంగళగిరిని రక్షించేందుకే, గంధకాన్ని ఉపశమింపజేసేందుకే, నిత్యం పానకాన్ని నివేదించాలని, పూర్వీకులు దేవుని పేరిట ఈ ఏర్పాటు చేశారని వాదిస్తుంటారు.

ఎలా వెల్లలి?
                     గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్నది.విజయవడ నుండి అన్ని రకాల ప్రయాన వసతులు బుస్,రైల్వే,మరియు విమనశ్రయం ఉన్నయి. విజయవడ నుండి మంగలగిరి కి 14 కిమి దూరం లో ఉంది.


Friday, November 27, 2015

Eka Sloka Bhagavatamu

ఏకశ్లోకి భాగవతము
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )





ఆదౌ దేవకి దేవీ గర్భజననం - గోపీగృహే వర్ధనం

మాయాపూతన జీవీతాపహరణం - గోవర్ధనోద్దారణం

కంసచ్చేదన కౌరవాదిహననం - కుంతీసుతాన్ పాలనం

యేతద్భాగవతం పురాణకధితం శ్రీకృష్టలీలమృతం . 



Thursday, November 26, 2015

Eka Sloka Ramayanamu

ఏకశ్లోకి రామాయణము
( నిత్యం పటించవలిసిన శ్లోకం )




ఆదౌరామ తపోవనాది గమనం - హత్వామృగంకాంచనం

వైదేహీహరణం - జటాయుమరణం - సుగ్రీవసంభాషణం

వాలీనిగ్రహణం - సముద్రతరణం -లంకాపురీదాహనం

పశ్చాద్రావణ కుంభకర్ణహాననం యేతద్దిరమాయణమ్.




Wednesday, November 25, 2015

మహానంది

మహానంది

రాష్ట్రం:                      ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:                       కర్నూలు
మండల కేంద్రము:  మహానంది



                                               మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము. నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.



                               ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.




                             ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.

ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కలదు. అదేమంటే, గర్భాలయానికి ప్రక్కన ఒక శిలా మండపం కలదు. అది నవీన కాలంలో చెక్కిన శిల్పాలు. ఆ శిలా స్థంబాలపై ఆ శిల్పి తల్లి తండ్రుల శిల్పాలు చెక్కి తల్లి దండ్రులపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. అదే విధంగా స్థంబాలపై, గాంధీ మహాత్ముని ప్రతిమ, ఇందిరా గాంధి ప్రతిమ, జవహర్ లాల్ నెహ్రూ ప్రతిమలను చెక్కి తనకున్న దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ క్షేత్రం 19వ శతాబ్ది తొలిభాగంలో కీకారణ్యంగా ఉండేది. 1830లో ఈ ప్రాంతానికి కాశీయాత్రలో భాగంగా వచ్చిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రాచరిత్రలో భాగంగా ఆ వివరాలు వ్రాశారు. గుడి చుట్టూ సకలఫల వృక్షాలూ ఉండేవనీ, గుడి సమీపంలో ఒక గుడిసె కూడా ఉండేది కాదని ఆయన వ్రాతల వల్ల తెలియవస్తున్నది. అప్పట్లో అన్ని వస్తువులు బసవాపురం నుంచి తెచ్చుకోవాల్సి వచ్చేది. చివరకు నిప్పు దొరకడం కూడా ప్రయాసగానే ఉండేదని ఆయన వ్రాశారు. రాత్రిపూట మనుష్యులు ఉండరనీ తెలిపారు. అర్చకునిగా తమిళుడు ఉండేవారనీ, వచ్చినవారు తామే శివునికి అభిషేకము చేసి పూజించేందుకు అంగీకరించేవారని తెలిపారు. అర్చకుడు ప్రతిదినం ఉదయం తొలి జాముకు వచ్చి ఆలయగర్భగుడి తెరిచేవారు. గోసాయిలు, బైరాగులు రెండు మూడు రోజులు ఆ స్థలంలోనే ఉండి పునశ్చరణ చేసేవారు. మొత్తానికి 1830ల నాటికి ఇది పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధమైనా సౌకర్యాలకు తీవ్రమైన ఇబ్బంది ఉండేది. నంద్యాల నుండి మహానందికి బస్సు సౌకర్యము కలదు. గిద్దలూరు-నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె, ఇక్కడికి సమీప రైల్వే స్టేషను.

నవనందులు:   



                                  కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.



ఎలా వెళ్ళాలి?

                           సమీపంలో నంద్యాల రైల్వే స్టేషన్  ఉంది.మహానంది నంద్యాల నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం హైదరాబాద్, హైదరాబాద్ నుండి కర్నూలు కి 215 కిమీ ఉంటుంది.

Monday, November 23, 2015

Eka Sloka Bhagavatgita

ఏకశ్లోకి భగవద్గీత
(ప్రతి రోజు ఉదయం  చదవవలిసిన శ్లోకం )



ఓం యత్రయోగీశ్వరః కృష్టోయత్రపార్థోధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిర్ద్రువా నీతిర్మతిర్మమ

పార్ధాయ ప్రతిబోధితాం - భగవతే నారాయణేన స్వయమ్ 

వ్యాసేన గ్రథితాం - పురాణమునినా మద్యేమహాభారతమ్ 

అద్వైతామృత వర్షిణీం భగవతీమష్ఠాదశధ్యాయినీ

మంబత్వామను సందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్. 




Saturday, November 21, 2015

దశరథ ప్రోక్త శనిస్తోత్రము (dasaradha prokta shanistotram)

దశరథ ప్రోక్త శనిస్తోత్రము

దశరథుడే స్వయం గా రచించిన శని స్తోత్రం దీనిని ప్రతి నిత్యం చదవడం వాల్ల శని దోషాలు దూరమౌతాయి.




నమః కృష్టాయ నీలాయ l శిఖి ఖండ నిభాయచ l
నమో నీల మధూకాయ l నీలోత్పల నిభాయచ l

నమో నిర్మాంస దేహాయ l దీర్ఘ శ్రుతి జటాయచ l
నమో విశాల నేత్రాయ l శుష్కోదర భయానక l

నమః పౌరుష గాత్రాయ l స్థూల రోమాయతే నమః l
నమో నిత్యం క్షుధార్తాయ l నిత్య తృప్తాయతే నమః l

నమో దీర్ఘాయ శుష్కాయ l కాలదంష్ట్ర నమోస్తుతే l
నమస్తే ఘోర రూపాయ l దుర్నిరీక్ష్యాయతే నమః l

నమస్తే సర్వ భక్షాయ l వలీముఖ నమోస్తుతే l
సూర్య పుత్ర నమస్తేస్తు l భాస్కరోభయ దాయినే l

అధో దృష్టే నమస్తేస్తు l సంవర్తక నమోస్తుతే l
నమో మందగతే తుభ్యం l నిష్ర్పభాయ నమోనమః l

తపసా జ్ఞాన దేహాయ l నిత్యయోగ రతాయచ l
జ్ఞాన చక్షుర్నమస్తేస్తు l కశ్యపాత్మజ సూనవే l

తుష్టో దదాసి రాజ్యం తం l క్రకుద్ధో హారసి తత్ క్షణాత్ l
దేవాసుర మనుష్యాశ్చ l సిద్ధ విద్యాధరో రగాః l





Friday, November 20, 2015

నవ దుర్గ స్తుత్తిః (nava durga stutti)

నవ దుర్గ స్తుత్తిః
( ఈ స్తోత్రాన్ని ఎవరు భక్తీ తో పఠిస్తే వారికి దేవి అనుగ్రహం కలుగును ) 




ప్రథమా శైలపుత్రీచ; 
ద్వితీయ బ్రహ్మచారిణీ; 
తృతియా చంద్ర ఘంటేతి; 
కూష్మాండేతి చతుర్థికీ;
 పంచమా స్కంద మాతేతి; 
షష్ఠా కాత్యాయనేతిచ; 
సప్తమా కాళరాత్రీచ; 
అష్టమాచాతి భైరవీ; 
నవమా సర్వసిద్ధిశ్చాత్; నవదుర్గా ప్రకీర్తితా!

అష్టాదశ పీఠముల ప్రార్థన (Ashtadasa pitamulu)

అష్టాదశ పీఠముల ప్రార్థన

(ఈ  స్తోత్రాన్ని ప్రతి రోజు సూర్యష్టమయం లో పఠిస్తే శ్రత్రువుల మీద విజయం, సర్వ రోగాలు దురమౌతయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. )





ఓం లంకాయాం శాంకరీదేవి ;

కామాక్షీ కాంచికాపురీ ;

ప్రద్యుమ్నే శృంఖలాదేవీ ;

చాముండే క్రౌంచపట్టణే ;

అల్లంపురి జోగులాంబ ;

శ్రీశైలే భ్రమరాంబికా ;

కొల్హాపురీ మహలక్ష్మీ ;

మహుర్యే ఏకవీరికా ;

ఉజ్జయిన్యాం మహాకాళీ ;

పీఠికాయాం పురుహూతికా ;

ఓఢ్యాయం గిరిజాదేవి ;

మాణిక్యా దక్ష వాటికా ;

హరిక్షేత్రే కామరూపీ ;

ప్రయాగే మాధవేశ్వరీ ;

జ్వాలాయాం వైష్ణవీదేవీ ;

గయామాంగళ్య గౌరికా ;

వారణశ్యాం విశాలాక్షీ ;

కాశ్మీరేతు సరస్వతీ ;

అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం

సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రువినాశనం

సర్వ రోగహరం దివ్యం, సర్వసంపత్కరం శుభం !







గోమాహత్మ్యము ( Gomahatyamu)

గోమాహత్మ్యము



అలనాడు 

  1. దేవేంద్రుని భార్య శచీదేవి
  2. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి
  3. శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి
  4. శ్రీరాములవారి భార్య సీతాదేవి
  5. గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణిదేవి
  6. ఈశ్వరుని భార్య పార్వతీదేవి 
  7. వశిష్టులవారి భార్య అరుంధతీదేవి

వీరంతా గూడి ప్రాతః కాలమునలేచి ఆడవారు చేసిన పాపములు ఎలగును పోవును క్రుష్ణా? అని అడిగినారు.

ప్రొద్దుటేలేచి గోవుమాహత్మ్యము పఠించుకుంటే సకలపాపములు పోవును.
అంటుకలిపిన పాపము, ముట్టుకలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగీ ఎరిగకచేసిన పాపము అంతా కూడా పరిహరము.

మధ్యాహ్నకాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే

సహస్ర గుళ్ళలో దీపారధన చేసినట్లు, జాన్మంతరం ఐదోతనము ఇచ్చినట్లు నూరు గోవులు దానము చెసినట్లు.

అర్థరాత్రివేళపఠిస్తే ఏమిటి కృష్ణ ? అంటే 

యమభాధలు పడబోరు, యమకింకరులు చూడబోరు. గోవుమాహాత్మ్యము పఠించిన పణతివస్తుంది.

 ఏలాగున వస్తుంది? ఏ తీరునవస్తుంది?

 కనకాంబరాలతో కదులుతో తులా భారలతో తులతూగుతూ తన భర్తను తలచుకోని తనపుత్ర పుత్రికా పౌత్రులను తలచుకొని, మిత్రబంధువులనను కొని, లక్ష్మీ మహలక్ష్మీ ఎదురుగుండా వచ్చినది. ఆవిడను క్రిందకు దింపేసి పసుపు, పారాణి, అక్షతలు, గంధములు యిచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి, ఇనుపముక్కు కాకులను వెనక్కుత్రోసేసి, మండే మండే పెనాలకు క్రిందకు దింపేసి ఆవిడ కాశి, గయ, ప్రయాగ అన్నీ చూసుకొని, వైకుంఠమునకు వెళ్ళినది, విన్నవారికి విష్ణులోకము , చెప్పిన వారికి పుణ్యలోకము. 




ఏకవింశతి దేవీస్తుతి శ్లోకీ (Devistuti)

ఏకవింశతి దేవీస్తుతి శ్లోకీ

  1. యాదేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  2. యాదేవీ సర్వభూతేషు చేతనే త్యభిధీయతే నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  3. యాదేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  4. యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  5. యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  6. యాదేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  7. యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  8. యాదేవీ సర్వభూతేషు తృష్టారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  9. యాదేవీ సర్వభూతేషు క్షాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  10. యాదేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  11. యాదేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  12. యాదేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  13. యాదేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  14. యాదేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  15. యాదేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  16. యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  17. యాదేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  18. యాదేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  19. యాదేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  20. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
  21. యాదేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః

తా : సర్వభూతములయందు విష్ణుమాయ అనుపేరు నిలిచియుండు దేవికి అనేక సార్లు నమస్కారములు. అంతేకాక సర్వభూతములందును చేతనా(తెలివి) స్వరూపమై, బుద్ధి స్వరూపమై, నిద్రా స్వరూపమై, క్షుధా(ఆకలి) స్వరూపమై, ఛాయా(ప్రతిబింబ) స్వరూపమై, శక్తి స్వరూపమై, తృష్ణా(దప్పి) స్వరూపమై, క్షాన్తి(ఓర్పు) స్వరూపమై, జాతి స్వరూపమై, లజ్జా(వినమ్రత) స్వరూపమై, శాన్తి స్వరూపమై, శ్రద్ధా(ఆసక్తి) స్వరూపమై, కాన్తి(అందము) స్వరూపమై, లక్ష్మీ(భాగ్యము) స్వరూపమై, వృత్తి స్వరూపమై, స్మృతి(జ్ఞప్తి) స్వరూపమై, దయాస్వరూపమై, తుష్టి(తృప్తి) స్వరూపమై, మాతృ స్వరూపమై, భ్రాన్తి స్వరూపమై ఉండుదేవికి పలుమార్లు భక్తితో విశ్వాసంతో నమస్కారములు.


శ్రీమార్కండేయ పురాణ దేవీమాహాత్య్మం ( శ్రీదేవీసప్తశతీ ) లో పంచమ అధ్యాయంలో దేవీనిస్తుతించే ఇరువదినొక (21) శ్లోకములు 

పైన చెప్పిన 21 శ్లోకములను నిత్యం పఠించినచో దేవి అనుగ్రహం కల్గునని పురాణవచనం.