Tuesday, November 3, 2015

సోమారామము (Somaramam)

సోమారామము
దేశము:         భారత్
రాష్ట్రం:           ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:            పశ్చిమగోదావరి
ప్రదేశము:    భీమవరంపశ్చిమగోదావరి

                                    
                                      పంచారామాల్లో ఒకటైన భీమారామము, భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో కలదు. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడినది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.
స్థలపురాణం:

                            త్రిపురాసుర సంగ్రామంలో కుమారస్వామి చేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి పడిందని. అందువలన ఇది పంచారామాలలో ఒకటి అయింది. ఈ లింగం చంద్ర ప్రతిష్టితమని విశ్వసొంచబడుతుంది.ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించడం వెనుక కూడా ఓ పురాణ కథ వుంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది.
ఆలయ ప్రశస్థి:
                            చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను , గోపురాన్నినిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి. అందువలన ఇది భీమారామంగా పిలువబడుతుంది. ఇక్కడి శివలింగ చంద్రప్రయిష్టితం కనుక సోమేశ్వరం అనికూడా పిలువబడుతుంది. భక్త సులభుడైన పరమశివుడు ఇక్కడ సోమేశ్వరస్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటాడు. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
ఆలయంలో ప్రత్యేకతలు:
                                  శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము కృమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి భూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మర్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయపు ముందు బాగమున కోనేరు కలదు ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము కలదు ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.

ప్రత్యేక ఉత్సవాలు:
                           ప్రతి ఏడాది ఇక్కడ మహా శివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు అయిదు రోజులపాటు జరుగుతాయి. అలాగే దేవీనవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తుంటారు.

చేరుకునే మార్గం:
                                     
                       విజయవాడ, ఏలూరు నుండి భీమవరం నుండి నేరుగా బస్సులు ఉన్నాయి.  గుణుపూడి  ఒక చిన్న గ్రామం, కానీ ఇప్పుడు, భీమవరం యొక్క భాగం,భీమవరం చేరుకున్నాక అక్కడ నుండి ఆటో లో గుణుపూడి వెళ్ళాలి.
                      కార్తీక లో మాసం APSRTC ఒకే రోజు అన్ని పంచారామాలు కవర్ అయ్యేలాగా ప్రత్యేక పర్యటన బస్సులు నిర్వహిస్తుంది.భీమవరం రైల్వే స్టేషన్ సోమేశ్వర స్వామి ఆలయం నుండి 2km దూరంలో కలదు.
                       సమీప విమానాశ్రయాలు విజయవాడ / రాజమండ్రి వద్ద ఉన్నాయి.





Monday, November 2, 2015

అమరారామం (Amararamam)

అమరారామం 

రాష్ట్రం          -ఆంధ్ర ప్రదేశ్
జిల్లా          -గుంటూరు జిల్లా
మండలం  -అమరావతి



                           ఈ పట్టణము వేల సంవత్సరాల ప్రాచీనమైన చరిత్ర కలిగి ఉన్నది. ప్రాచీన శాసనాల ప్రకారము ఈ పట్టణానికి ధాన్యకటకము అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయము పేరు మీదుగా అమరావతి పేరు వచ్చింది. పట్టణము జైన, బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధమైనది. శాతవాహనులలో ప్రసిద్ధుడైన గౌతమీపుత్ర శాతకర్ణి మూలముగా క్రీ.శ. ఒకటవ శతాబ్దములో ధాన్యకటకము ప్రసిద్ధిచెందినది.చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణము లో వసించి అచటి వైభవము గురించి ప్రశంసించాడు.

                      అమరావతిలో కల అమరేశ్వర ఆలయం కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది. గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతి లోనే బోధించాడు. అందువలన అమరావతి బుద్ధునికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ ఔతున్నది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రాయన గ్రంథంలో పొందుపరచబడి వున్నాయి. నేడు ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.


అమరేశ్వరాలయం:


                               గర్భాలయంలో 15 అడుగుల ఎత్తులో పొడవుగా ఊన్న మహా శివలింగం దంతం రంగులో ఉంటుంది. ఈ శివలింగం అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో తలపై మేకు కొట్టినట్టు చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు కూడా కనిపిస్తూ వుండటం విశేషం. ప్రతి యేటా విజయదశమి రోజున . మహా శివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ స్వామివారికి . అమ్మవారికి అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం జరిపించబడుతూ ఉంటుంది. చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు . జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు ,కుమార స్వామి , ఆంజనేయ స్వామి ఉంటారు. ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు ప్రతిష్టితమై ఉన్నాడు.

అమరారామం:
                            అమరలింగేశ్వర స్వామి (శివుడు) పుణ్య క్షేత్రం ఈ పట్టణములో కృష్ణానదీ తీరాన యున్నది. ఆంధ్ర ప్రదేశ్ లోని పంచారామాలలో ఇది ఒకటి. వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు వున్నాయి. కన్నడాంధ్ర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తేటతెల్లం చేస్తోంది. కొండవీటి రెడ్డిరాజులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగారు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది. నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందుతున్నాడని ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించినట్టుగా ఇందులో రాసి ఉంది.
స్థలపురాణం:
                    త్రిపురాసుర సంహారసమయంలో కుమారస్వామిచేత విరుగకొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు వివరిస్తున్నాయి. పంచారామాలలో ఒకటైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే ఆవిర్భవించిన విశిష్టమైన పుణ్యక్షేత్రం. పురాణాల్లో క్రౌంచతీర్థంగా పేర్కొనబడింది. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్టించి . అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్టించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.
పునరుద్ధరణ:

                       1980లో జరిగిన పుష్కరాల సమయంలో అమరావతిలో పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రస్థుతం మనం చూస్తున్న విశాలమైన ఆలయద్వారం ఎత్తైన గాలిగోపురం గతంలో చిన్నద్వారం చిన్న గాలిగోపురంగా ఉండేవి. మొత్తం విచ్చిన్నం చేసి కొత్త నిర్మాణం కొరకు లోతుగా పునాదులు తీయబడ్డాయి. ఈ తవ్వకాలలో భౌద్ధ సంస్కృతికి చెందిన పాలరాతి శిల్పాలు అనేకం లభించాయి. ప్రస్థుతం మ్యూజియంలో కనిపిస్తున్న నంది ఈ తవ్వకాలలో లభించిందే. అలాగే మరికొన్ని చిన్న శిల్పాలు ఈ తవ్వకాలలో లభించాయి.
బౌద్ధ సంస్కృతి:

                     అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి. సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న అధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. మరుగునపడిన చైత్యప్రాశస్త్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. దీపాలదిన్నెగా పిలువబడిన పెద్ద దిబ్బను త్రవ్వి 1797 లో మహాస్తూపాన్ని వెలుగులోకి తెచ్చిన వ్యక్తి కల్నల్ కోలిన్ మెకంజీ. అప్పటికే మహాచైత్యం అంతా కూలిపోయి 90 అడుగుల చుట్టుకొలత, 20 అడుగుల ఎత్తుగల ఒక దిబ్బలాగా మిగిలింది. అనేక విడతలుగా జరిగిన తవ్వకాలలో ఎన్నో విలువైన విగ్రహాలు, పరికరాలు మరియు ఇతర వస్తువులు దొరికాయి. ఈ త్రవ్వకాలను సర్ వాల్టర్ స్మిత్ 1845 లో, రాబర్ట్ సీవెల్ 1877 లో, జేమ్స్ బర్గెస్ 1881 లో మరియు అలక్జాండర్ రియ 1888-89 మధ్యలో చేపట్టారు. ఆఖరున జరిగిన తవ్వకాలలో ఈ చైత్య నిర్మాణానికి కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నివసించిన మెగాలిథ్స్ కి సంబంధించిన అవశేషాలు కూడా దొరికాయి. ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ మద్రాస్ గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై మరియు బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు. ధాన్యకటకంలో 1962-65 మధ్యలో యమ్. వెంకటరామయ్య మరియు కె.రాఘవాచారి ల అధ్వర్యంలో త్రవ్వకాలు జరిగాయి. 



                          తావ్వకాల తరువాత పాలరాతి మీద చెక్కబడిన ప్రధాన్యత లేని కొన్ని శిల్పాలు నిర్లక్ష్యంగా వదిలి వేయబడ్డాయి. ప్రజలు ఈ పాలరాతి ముక్కలను తమ ఇండ్లకు తీసుకువెళ్ళి మెత్తని పొడిచేసి రంగోలీలో వాడుకున్నారు. తరువాత ఒక పలుచని కంచెతో సురక్షితం చేసినా ప్రజలు సులువుగా లోపల ప్రవేశించి స్థాపం సమీపంలో సంచరించారు. ఇందులో ఐదు పీరియడ్స్ కి సంబంధించిన నివాసుల అధారాలు దొరికాయి. కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్ధికి చెందిందని తెలిసింది.
అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్దుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్థూపం గురించి అప్పటి బ్రిటిషు పురాతత్వ పరిశోధకుడు ఫెర్గుసన్ ఇలా అన్నాడు: "కళావైదుష్యానికి సంబంధించి ఇది భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన కట్టడము". దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు.

అమరావతి స్తూపం:
                                 స్థూపం ఉండిన ప్రదేశం, భారతీయ పురాతత్వ సర్వేక్షణ వారి సంగ్రహాలయము మరియు అమరేశ్వర మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.
సత్యం శంకరమంచి వ్రాసిన అమరావతి కథలు ఈ గ్రామ/పట్టణ సంస్కృతికి అద్దంపట్టాయి.
గ్రామంలోని ఇతర దేవాలయలు:
శ్రీ బాలత్రిపురసుందరీ అమ్మవారి ఆలయం:-  అమరావతి గ్రామంలోని క్రోసూరు రహదారి చెంత ఈ నూతన ఆలయ ప్రతిష్ఠోత్సవ వేడుకలు 2014,జూన్-8, ఆదివారం నాడు కన్నులపండువగా కొనసాగినవి. ఈ సందర్భంగా మండప దేవతాపూజలు, ప్రాతరౌపాసన, గర్తన్యాసం, రత్నన్యాసం, జీవన్యాసం, ధాతున్యాసాలను శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఉదయం 7-43 గంటల దివ్యముహూర్తంలో యంత్రస్థాపన, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠోత్సవాలను నిర్వహించినారు. అదే సమయంలో, సింహవాహనం, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి, శిఖర, కలశ ప్రతిష్ఠా మహోత్సవాలను సైతం, నిర్వహించినారు. 9 గంటలకు కళాన్యాసం, ప్రాణప్రతిష్ఠ, దిష్టికుంభం, పూర్ణాహుతి నిర్వహించినారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించినారు.

చేరుకునే మార్గం:
               విజయవాడ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతి చేరుకోవడానికి విజయవాడ నుండి నేరుగా బస్సులున్నాయి. గుంటూరు నుండి 32 కిలోమీటర్ల దూరం ఉన్న అమరావతి చేరుకోవడానికి గుంటూరు నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. గుంటూరు, విజయవాడల నుండి రైలులో కూడా అమరావతి చేరుకోవచ్చు. లేదా బోటులలో తేలికగా చేరవచ్చు.




Sunday, November 1, 2015

శ్రీ శివపంచాక్షరీ స్తొత్రం (Sri sivapanchakshari mantram)



శ్రీ శివపంచాక్షరీ స్తొత్రం






ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ l
నిత్యాయ శుధ్ధాయ దిగంబరాయ తస్మై కారాయ నమశ్శివాయ ll

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ l
మందారపుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై కారాయ నమశ్శివాయ ll

శివాయ గౌరీ వదనాబ్జ భ్రుంగ సూర్యాయ దక్షాధ్వర నాశకాయ l
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ  తస్మై శి కారాయ నమశ్శివాయ ll

వసిష్ఠ కుంభోద్భవ గౌతమాది మౌనీంద్ర సేవార్చిత శేఖరాయ l
చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై  కారాయ నమశ్శివాయ ll

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనయ l
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై  కారాయ నమశ్శివాయ ll

పంచాక్షరమిదం పుణ్యం య: పఠేత్ చ్ఛివసన్నిధౌ l 
శివలోక మవాప్నోతి శివేనసహ మోదతే ll



Saturday, October 31, 2015

శ్రీ కృష్టాష్టకమ్ (sri krishnastakam)

శ్రీ కృష్టాష్టకమ్  




వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం  
దేవకీ పరమానందం కృష్టం వందే జగద్గురమ్.1

అతసీ పుష్పసంకాశం హారనూపుర శోభితం
రత్నకంకణ కేయూరం కృష్టం వందే జగద్గురమ్.2

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం
విలసత్కుండల ధరం దేవం కృష్టం వందే జగద్గురమ్.3

మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం
బర్హి పింఛాంగచూడాంగం కృష్టం వందే జగద్గురమ్.4

ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం
యాదవానాం శిరోరత్నం కృష్టం వందే జగద్గురమ్.5

రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం
అవాప్తతులసీగంధం కృష్టం వందే జగద్గురమ్.6

గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం
శ్రీనికేతం మహేష్వాసం కృష్టం వందే జగద్గురమ్.7

శ్రీవత్సాంకం మహ్హెరస్కం వనమాలా విరాజితం
శంఖచక్ర ధరం దేవం కృష్టం వందే జగద్గురమ్.8

             కృష్టాష్టకమిదం పుణ్యం ప్రాతరుత్ధాయ య: పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.



Friday, October 30, 2015

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తొత్రం (Sri saraswathi dwadasanaama stotram)



శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తొత్రం





సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తక ధారిణీ l
హాంసవాహా సమాయుక్తా విద్యాదానకరీ మమ ll

ప్రథమం భారతీనామ ద్వితీయం చ సరస్వతీ l
తృతీయం శారదాదేవి చతుర్థం హాంసవాహనా ll 

పంచమం జగతీ ఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా l
కౌమారీ సప్తమం ప్రోక్త మష్టమం బ్రహ్మచారిణీ ll

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ l
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ  ll

బ్రాహ్మీ ద్వాదశ నామని త్రిసంధ్యం య: పఠేన్నర: l
సర్వసిధ్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ l
సామే వసతు జిహ్వగ్రే బ్రహ్మరూపా సరస్వతీ ll




Thursday, October 29, 2015

సంకట నాశన గణేష స్తొత్రం (Sankata naasana ganesha stotram)


సంకట నాశన గణేష స్తొత్రం





నారద ఉవచ :
ప్రణమ్య శిరసాదేవం గౌరిపుత్రం వినాయకం l
భక్తవాసం స్మరేన్నిత్య మాయుః కామార్ధ సిద్దయే ll

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం l
తృతీయం కృష్ణపింగాక్షం గణవక్త్రం చతుర్దకం ll

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ l
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం ll

నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం l
ఏకదశం గణపతిం ద్వాదశం తు గజాననం ll

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః l
న చ విఘ్నభయం తస్య సర్వసిధ్ధికరం ప్రబో ll

విద్యర్ధీ లభతే విధ్యాం ధనార్దీ లభతే ధనం l
పుత్రార్దీ లభతే పుత్రా న్మొక్షార్ధీ లభతే గతీం ll

జపేద్గణపతి స్తొత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ l
సంవత్సరేణ సిధ్ధిం చ లభతే నాత్ర సంశయః ll

అష్టభ్యొ భ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వ యః సమర్పయేత్ l
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ll



Wednesday, October 28, 2015

మంత్రాలయము (Mantralayam)

మంత్రాలయము
రాష్ట్రం       :  ఆంధ్ర ప్రదేశ్
జిల్లా        :   కర్నూలు
మండలం :   మంత్రాలయము



                                   మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం కలదు. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు కలవు. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
                                                                           
                               అక్టోబరు 2, 2009న తుంగభద్ర నది ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానికి వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి:


                                 శ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతములో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనునయించాడు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.


వివిధ మార్గాల ద్వారా -
1.ట్రైన్ మార్గం ద్వారా
                                                    మంత్రాలయం రోడ్ అనే రైలు స్టేషన్, 15 కిలోమీటర్ల దూరంలో మంత్రాలయ నుండి ఉంది. స్థానికంగా, అది కూడా తుంగభద్ర అంటారు. మద్రాస్ (చెన్నై) - - బాంబే (ముంబై) రైలు మార్గం, అలాగే బెంగుళూర్ - - బాంబే మార్గం ఈ స్టేషన్ లో ఉన్నది. ఈ మార్గం లో అత్యంత ప్రధాన రైళ్ళు నడుస్తువుంటయ్. స్టేషన్ నుండి భక్తులు చాలా తరచు బస్సు ద్వారా మంత్రాలయం చేరాతరు. అదనంగా, భక్తుల సౌలభ్యం కోసం అందుబాటులో ఇతర ప్రైవేటు వాహనాలు పుష్కలంగా ఉన్నాయి. సన్నిహిత రైలు జంక్షన్ గుంతకల్ ఉంది.
2.రోడ్డు మార్గం ద్వారా

                               మంత్రలయం ఆంధ్ర ప్రదేశ్ కర్నూలు జిల్లా యొక్క యెమ్మింగనూరు తాలూకాలోని చివరి పట్టణం. మీరు తుంగభద్ర నది దాటిక మీరు కర్నాటకలో ఉంట్టరు. ఆంధ్ర, కర్ణాటక లో అత్యంత ప్రధాన పట్టణాలు మరియు నగరాలను కలుపుతు మంత్రాలయం కు బస్సులు ఉన్నాయి.

3.ఆకాశమార్గం ద్వారా -
                                        హైదరాబాద్ విమానాశ్రయం మంత్రాలయ కు దగ్గరగా ఉంది. ఇది మంత్రాలయ నుండి 240 కిలో.మీ ఉంది. అక్కడ నుండి రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా మంత్రాలయ చేరవచ్చు. మరో ప్రత్యామ్నాయం పుట్టపర్తి లో విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుండి రైలు లేదా రోడ్డు ద్వారా మంత్రాలయ చేరవచ్చు.