Wednesday, November 11, 2015

అర్ధనారీశ్వరస్తోత్రం (ardhanariswara stotram)

అర్ధనారీశ్వరస్తోత్రం



శ్లో ll  చామ్పేయగౌరార్ధశరీరకాయై కర్పూరగౌరార్ధశరీరకాయ l
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  కస్తూరికాకుంకుమచర్చితాయై చితా రజః పుఞ్జవిచర్చితాయ l
కృతస్మరాయై వికృతస్మరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  ఝణత్క్వణత్కంకణనూపురాయై పాదాబ్జరాజత్ఫణితనూపురాయ l
హేమాంగదాయై భుజగాంగదాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  విశాలనీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ l
సమేక్షణాయై విషమేక్షణాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  మన్దారమాలాకలితాలకాయై కపాలమాలాంకితకన్ధరాయ l
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  అమ్భోధరశ్యామలకున్తలాయై తటిత్ర్పభాతామ్రజటాధరాయ l
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ l
జగజ్జనన్యై జగదేకపిత్రే నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై స్ఫురన్మహపన్నగభూషణాయ l
శివాన్వితాయై చ శివాన్వితాయ నమఃశివాయై చ నమఃశివాయ ll

శ్లో ll  ఏతత్పఠేదష్టకమిష్టదం యో భక్త్యా సమాన్యో భువిదీర్ఘజీవీ l
ప్రాప్నోతి సౌభాగ్యమనన్తకాలం భూయాత్సదాచాస్య సమస్తసిద్ధిః ll


ఫలశ్రుతి : దీనిని భక్తితో చదివినవారికి భూమిపై చిరంజీవులై గౌరవాన్ని  సౌభాగ్యాన్ని, భార్యా భర్తలు అన్యోన్యతను కలుగజేయును.

Tuesday, November 10, 2015

గురుపాదుకా స్తొత్రం (Gurupadhuka stotram)

శ్రీ ఆదిశంకరాచార్యవిరచిత శ్రీ గురుపాదుకా స్తొత్రం



శ్లోll అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్ l
వైరాగ్య సామ్రాజ్యదపూజనాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll కవిత్వ వారాశినిశాకరభ్యాం దౌర్భాగ్యదావాం బుదమాలికాభ్యామ్ l
దూరికృతానమ్రవిపత్తితిభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll నతా యయోఃశ్రీపతితాం సమీయుః కదాచిదప్యాశు దరిద్రవర్యాః l
మూకాశ్ర్చ వాచస్పతితాం హితాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll నాలీకనీకాశ పదాహృతాభ్యాం నానావిమోహాది నివారికాభ్యామ్ l
సమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll నృపాలి మౌలివ్రజరత్నకాంతి సరిద్విరాజత్ ఝషకన్యకాభ్యామ్ l
నృపత్వదాభ్యాం నతలోకపంకతేః నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll పాపాంధకారార్క పరంపరాభ్యాం తాపత్రయాహీంద్ర ఖగేశ్రరాభ్యామ్ l
జాడ్యాబ్ధి సంశోషణ వాడవాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll శమాదిషట్కరపదవైభవాభ్యం సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్ l
రమాధవాంధ్రిస్థిరభక్తిదాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll స్వార్చాపరాణామ్ అఖిలేష్టదాభ్యాం స్వాహసహయాక్షధురంధరాభ్యమ్ l
స్వాంతాచ్ఛభావప్రదపూజనాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll

శ్లోll కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యామ్ l
భోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యం నమోనమః శ్రీగురుపాదుకాభ్యామ్ ll


Monday, November 9, 2015

శ్రీ మంగళ చండికా స్తోత్రం (mangala chamdika stotram)

శ్రీ మంగళ చండికా స్తోత్రం



శ్లోll రక్ష రక్ష జగన్మాతః దేవీ మంగళ చండికే l
హరికే విపదాం హర్ష మంగళ కారికే ll

శ్లోll హర్ష మంగళ దక్షే చ హర్ష మంగళ దాయికే l
శుభే మంగళ దక్షే చ శుభే మంగళ చండికే ll

శ్లోll మంగళ మంగళ దక్షే చ సర్వమంగళ మాంగళ్యే l
సదా మంగళదేవీం సర్వేషాం మంగళాలయే ll

శ్లోll పూజ్యే మంగళ వారేచ మంగళాభీష్ట దేవతే l
పూజ్యే మంగళ భూపస్య మను వంశస్య సంతతీ ll

శ్లోll మంగళా ధిష్టితా దేవీ మంగళానాం చ మంగళే  l
సంసార మంగళాధరే మోక్ష మంగళదాయినీ ll

శ్లోll సారే చ మంగళాధారే పారేచ సర్వ కర్మణా l
ప్రతిమంగళ వరేచ పూజ్య మంగళ సుఖప్రదే ll

ఫలితం : ధన, ధాన్య, వ్యాపార అభివృధ్ధికి, కోర్టువ్యవహరల అనుకూలతకు, సకల సమస్యలపరిష్కారార్ధం . 




Sunday, November 8, 2015

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచస్తొత్రం (Sri venkateswara vajrakavacham)

మార్కండేయకృత శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్ 




శ్లోll నారాయణం పరంబ్రహ్మ సర్వకారణకారకం l
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ll

శ్లోll సహస్రశీర్షాపురుషో వేంకటేశ శ్శిరోవతు l
ఫ్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః ll

శ్లోll ఆకాశరాట్ సుతానాధ ఆత్మానం మే సదావతు l
దేవదేవోత్తమః పాయాద్దేహం మే వేంకటేశ్వరః ll

శ్లోll సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజాని రీశ్వరః l
పాలయే న్మామకం కర్మసాఫల్యం నః ప్రయచ్చతు ll

శ్లోll య ఏతద్వజ్రకవచ మభేద్యం వేంకటేశితుః l
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ll

శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తొత్రంసంపూర్ణం  

Saturday, November 7, 2015

శ్రీ దుర్గాష్టకం (Durgastakam)

శ్రీ దుర్గాష్టకం



శ్లోll ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ద్దరస్మితం
తత్త్వం యస్యమహత్సూక్షం - మనన్దోవేతిసంశయః 

శ్లోll జ్ఞాతుర్జ్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియా 
యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్ట్యమనవస్థీతిః

శ్లోll దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే
నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివాl

శ్లోll శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ
అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా

శ్లోll దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః
ప్రజ్ఞావిషయతాదాత్మ్య - మేవం సాక్షాత్ ప్రదృశ్యతే 

శ్లోll పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః
జాగ్రత్ ప్రపఞ్చ ఏషస్యా - త్తథేశ్వర మహాచితః

శ్లోll వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గదేవాతా 
సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణీయతేపరాl

శ్లోll భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని 
ప్రభేవేద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః


ఫలశ్రుతి : యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థాయ మానవః
పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్ 


Friday, November 6, 2015

శ్రీ మహాలక్ష్మష్టకమ్ (mahalakshmastakam)

శ్రీ మహాలక్ష్మష్టకమ్ 


శ్లోll ఓం నమస్తేఅస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే l
 శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే ll

 శ్లోll నమస్తే గరుడారుఢే డోలాసురభయంకరీ l
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే ll

శ్లోll సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ l
సర్వదు:ఖహరే దేవీ మహాలక్ష్మి నమోస్తుతే ll

శ్లోll సిద్ధిబుద్ధిప్రదే దేవీ భుక్తిముక్తిప్రదాయినీ l
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే ll

శ్లోll అద్యన్తరహీతే దేవీ ఆద్యశక్తిమహేశ్వరీ l
యోగఙ్గే యోగసంభూతే మహాలక్ష్మి నమోస్తుతే ll

శ్లోll స్థూల  సూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే l
సర్వపాపహరే దేవీ మహాలక్ష్మి నమోస్తుతే ll

శ్లోll పద్మాసనస్థితే  దేవీ పరబ్రహ్మస్వరూపిణీ l
పరమేశి జగన్మాత: మహాలక్ష్మి నమోస్తుతే ll

శ్లోll శ్వేతామ్బరధరే దేవీ నానాలంకారభూషితే l
జగత్థ్సితే జగన్మాత:మహాలక్ష్మి నమోస్తుతే ll

శ్లోll మహాలక్ష్య్మష్టకస్తోత్రం  య: పఠేద్భక్తిమాన్నర: l
సర్వసిద్దిమవాప్నొతి రాజ్యం ప్రాప్నొతి సర్వదా ll
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాపవినాశనం l
ద్వికాలం య:పఠేన్నిత్యం ధనధాన్యసమన్విత: ll  
త్రికాలం య:పఠేన్నిత్యం మహాశత్రువినాశనం l
మహాలక్ష్మిర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా ll






Thursday, November 5, 2015

ద్రాక్షారామం (Draksharamam)

ద్రాక్షారామం
రాష్ట్రం        :   ఆంధ్ర ప్రదేశ్
జిల్లా          :   తూర్పు గోదావరి
మండలం:   రామచంద్రపురం



                               ద్రాక్షారామంలో గల శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము కాగా, మరొకటి శ్రీశైలము.
                      త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.
                          శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవి గా ప్రసద్ధి నందిన వేములవాడ భీమకవి " ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు. అతనికి కవిత్వం అబ్బటం స్వామి ప్రసాదం అయి ఉండవచ్చు.ఎంతో మంది తెలుగు కవులు శ్రీ భీమేశ్వరస్వామి ని తమ పద్యాలలో కీర్తించినారు. వాటిలో ఈమధ్య వచ్చిన "దక్షారామ భీమేశ్వర శతకం" ఒకటి. దీనిని ప్రొఫెసర్ వి.యల్.యస్. భీమశంకరం రచించాడు.

పేరు వెనుక చరిత్ర:

                                       పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది దాక్షారామంగా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది.తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమానంపాలైన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను వీరభద్రుడిని సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడు. సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.

భీమేశ్వరాలయం:

                                                 ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడిగా స్వయంభువు గా అవతరించాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.

అష్ట లింగాలు:
                                    ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్టించాడని విశ్వసించబడుతుంది.తూర్పున కోలంక ,పడమర వెంటూరు,'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి'వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర మరియు కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు ,పశ్చిమ ,ఉత్తర , దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.

స్థలపురాణం:

                       పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండ వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను. అవి వరుసగా అమరావతి, భీమవరం, పాలకొల్లు,ద్రాక్షారామం,సామర్లకోట ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండా పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొక్క దేముడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ట చేసి అభిషేకార్చనలు చేసారు. ఆఅ దేవుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఆయా దేవుని పేరుతో పిలవబడుతోంది.

అమరావతి:- ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'అమరేశ్వరస్వామి ' గా వెలిసెను.
భీమవరం:- ఇక్కడ చంద్రుడు ప్రతిష్టించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి ' గా వెలిసెను.
పాలకొల్లు:- ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్టించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి ' గా వెలిసెను.
సామర్లకోట:-ఆత్మలింగాన్ని చేధించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను.



దైనందిన కార్యక్రమాలు:
ప్రతీరోజు ఉదయం

5:00 మేలుకొలుపు,సుప్రభాతం,
5:30 ప్రాతఃకాలార్చన,తీర్ధపుబిందె,
5:45 బాలభోగం,
6:00 నుండి 12:00 సర్వదర్శనం,అభిషేకాలు,అర్చనలు,
మధ్యాహ్నం

12:00 మధ్యాహ్నకాలార్చన,
12:15 రాజభోగం,
12:15 -3:00విరామం,
3:00 నుండి 8:00 వరకు సర్వదర్శనం,పూజలు,అర్చనలు,
రాత్రి

7:30 నుండి 7:45 వరకు స్వస్తి ప్రవచనం,
7:45 నుండి 8:00 వరకు ప్రదోషకాలార్చన,నీరాజన మంత్రపుష్పాలు,ఆస్థానపూజ-పవళింపుసేవ,
రాత్రి 8:00 నుండి ఉదయం 5:00 వరకు కవాటబంధం.

పండుగలు:
  • ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ,పవళింపుసేవ.
  • ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం.
  • ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం.
  • ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రొజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం.
  • ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు.
  • ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ( భీష్మ ఏకాదశి )రోజున శ్రీ స్వామి వారి అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం.
  • ప్రతీ మహాశివరాత్రి పర్వదినము నందు శివరాత్రి ఉత్సవాలు జరుగును.
  • శరన్నవరాత్రులు(దేవీనవరాత్రులు)- ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు.
  • కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు).
  • సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు.


వసతి:
              ప్రతీ నిత్యం భక్తులు ఆంధ్ర రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. యాత్రీకుల సౌకర్యార్ధము ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నసత్రం కలదు. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహము ఆలయానికి 1/2 కి.మీ దూరంలో ఆర్.టి.సి బస్టాండుకు దగ్గరలో కోటిపల్లి రోడ్డులో కలదు. డార్మెట్రీ పెద్దది 1 రోజునకు రూ.200/-లు, డార్మెట్రీ చిన్నది 1 రోజునకు రూ.100/-లు.

ఎలా వెళ్ళాలి:
  1. కాకినాడరాజమండ్రివిజయవాడ నుండి చాలా బస్సులు ఉన్నాయి. కార్తీక లో APSRTC ఒకే రోజులో వాటిని అన్ని కవర్ అయ్యెల ప్రత్యేక పర్యటన బస్సులు నిర్వహిస్తుంది.
  2. సమీప రైల్వె స్టేషన్ సామర్లకొట ఉంది. సామర్లకొట వరకు రైలు మార్గం ద్వార వెల్లి అక్కడి నుండి బస్ కి గని అటొ కి గని వెల్లవచ్చు.
  3. సమీప విమానాశ్రయాలు రాజమండ్రి లేదా విజయవాడ వద్ద ఉన్నాయి.



Wednesday, November 4, 2015

క్షీరారామం (ksheeraramam)

క్షీరారామం
దేశము:     భారత దేశం
రాష్ట్రం:      ఆంధ్ర ప్రదేశ్
జిల్లా:        పశ్చిమ గోదావరి
ప్రదేశము:  పాలకొల్లు



                            ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలుగా ప్రసిద్ధి చెందిన 5 పుణ్యక్షేత్రాలలో పాలకొల్లు ఒకటి. శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో ప్రతిష్టితమైన ప్రసిద్ధ క్షీరారామలింగేశ్వరస్వామి దేవాలయం ఇక్కడే ఉంది. ఇక్కడి మందిరాన్ని చాళుక్యుల కాలంలో, 10 - 11 శతాబ్దులలో, నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో దర్శనమిస్తుంది. దీనికి కొద్ది దూరంలో ఒక చెరువు ఉన్నది గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మితమైన తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా ఏర్పడినదే. ఈ చెరువు(ప్రస్తుతం దీనిని రామగుండం అని పిలుస్తున్నారు). ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన, మరియు చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపే గోపురాలలో ఇది ఒకటి.

                     పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్టించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రాన్ని క్షీరపురి పాలకొలను, ఉపమన్యుపురం, అనే పేర్లతో కూడా పిలుస్తూ వుంటారు. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వసిస్తున్నారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. ఇక్కడి రాజగోపురం 9 అంతస్తులను కలిగి 120 అడుగుల ఎత్తులో అద్భుతమైన శిల్ప కళతో అలరారుతూ వుంటుంది. ఈ పుణ్య క్షేత్రానికి దశలవారీగా అభివృద్ధి పనులు జరిగాయనడానికి చాళుక్యులు ... రెడ్డి రాజులు ... కాకతీయులు వేసిన శాసనాలు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ పర్వ దినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు విశేషమైన సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి స్వామివారినీ, అమ్మవారిని దర్శించుకుంటారు.

ఆలయ ప్రశస్తి:
                           శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతిదేవి పూజలందుకుంటుంది. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని తలచి పూజిస్తారు. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఋణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఋణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు.

చరిత్ర:
చారిత్రికాంశాలు:
                              వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక క్రీ.శ.1157లో పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి అఖండదీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్యమంటపానికి క్రీ.శ. 1276లో కోన గణపతిదేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని క్రీ.శ.1415న అల్లాడ రెడ్డిభూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెళ్ళపిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణమండపం నిర్మించారు. క్రీ.శ.1777లో బచ్చు అమ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తిచేయించారు.

స్థలపురాణం:
       


                              
                                పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. క్షీరం అంటే పాలు. ఆ పేరుమీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు శివుడు ఇక్కడ బాణం వేస్తే భూమి లోనుంచి పాలు ఉబికివచ్చాయి. పాలకొల్లును పూర్వము క్షీరపురి, ఉపమన్యుపురం, పాలకొలను అని పిలిచేవారు. ప్రతిరోజూ చేయబడే అభిషేక క్షీరంతో ఈ చెరువు నిండిపోయి పాలకొలను అను పేరున పిలువబడుతూ ఆప్రాంతమునకు కూడా వర్తించి ఉండ వచ్చని ఒక కథనం. ​

ప్రయాణ వసతులు:
                                      ఇక్కడికి చేరుకునేందుకు రైలు,బసు మార్గం ద్వార చేరుకోవచ్చు.అంతేకాకుండ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. షుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.